News October 23, 2025

తెరపైకి గుమ్మడి నర్సయ్య జీవితకథ.. టైటిల్ రోల్‌లో స్టార్ హీరో

image

ప్రజానాయకుడు, సైకిల్‌పై అసెంబ్లీకి వెళ్లిన ఎమ్మెల్యేగా పేరున్న గుమ్మడి నర్సయ్య జీవిత కథ సినిమాగా రానుంది. ఈ చిత్రంలో టైటిల్ రోల్‌లో కన్నడ స్టార్ హీరో శివ‌రాజ్ కుమార్ నటిస్తున్నారు. ఈ మేరకు మూవీ యూనిట్ విడుదల చేసిన మోషన్ పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి పరమేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. గుమ్మడి నర్సయ్య తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు శాసనసభ నుంచి ఐదు సార్లు MLAగా ఎన్నికయ్యారు.

Similar News

News October 23, 2025

బాడీలోషన్నే ముఖానికి వాడుతున్నారా?

image

చర్మానికి తేమను అందించడానికి చాలామంది బాడీలోషన్ వాడుతుంటారు. కానీ కొంతమంది ఈ లోషన్నే ఫేస్​కి కూడా వాడుతుంటారు. దీనివల్ల ముఖంపై మొటిమలు పెరుగుతాయంటున్నారు నిపుణులు. ఇందులో వాడే కృత్రిమ పరిమళాలు మృదువుగా ఉండే ముఖ చర్మంపై అలర్జీలు రావడానికి కారణం అవుతుందంటున్నారు. కాబట్టి ముఖం కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఉత్పత్తులను వాడాలని సూచిస్తున్నారు.

News October 23, 2025

7,267 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 7,267 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. PGT, TGT, వార్డెన్(M, F), స్టాఫ్ నర్స్(F) తదితర పోస్టులున్నాయి. పోస్టును బట్టి PG, B.Ed, డిగ్రీ, BSc నర్సింగ్, ఇంటర్, టెన్త్ పాసైన వారు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. వెబ్‌సైట్: https://nests.tribal.gov.in

News October 23, 2025

ఇతిహాసాలు క్విజ్ – 44

image

1. భరతుని మేనమామ ఎవరు?
2. ఉత్తరుడు ఎవరి కుమారుడు?
3. బ్రహ్మ నివసించే లోకం పేరు ఏమిటి?
4. గరుడ పక్షి ఏ దేవుడి వాహనం?
5. భారతదేశంలోని ఏకైక బ్రహ్మ ఆలయం ఎక్కడ ఉంది?
– సరైన సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>