News October 23, 2025

మంచిర్యాల: వైన్స్ దరఖాస్తులు నేటితో పూర్తి

image

గురువారంతో మద్యం దుకాణాలకు దరఖాస్తు చేయడానికి గడువు ముగుస్తుందని జిల్లా ఎక్సైజ్ అధికారి అబ్దుల్ రజాక్ తెలిపారు. బుధవారం మద్యం దుకాణాలకు 7 దరఖాస్తులు వచ్చాయన్నారు. దీంతో మొత్తం జిల్లాలో మద్యం దుకాణాలకు 949 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. ఈ నెల 27న షాపుల కేటాయింపునకు లక్కీ డ్రా నిర్వహిస్తామన్నారు.

Similar News

News October 23, 2025

MBNR: జర్మనీలో ఉద్యోగాలు.. రేపు శిక్షణ

image

MBNR ప్రభుత్వ ఐటిఐ బాలుర క్యాంపస్‌లోని ఏటీసీ భవనంలో జర్మన్ భాషా శిక్షణ(A2 స్థాయి శిక్షణ) నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శాంతయ్య Way2Newsతో తెలిపారు. ఈ శిక్షణ రేపు రాష్ట్ర ప్రభుత్వ సంస్థ తెలంగాణ ఓవర్సీస్ మాన్ పవర్ కంపెనీ లిమిటెడ్(TOMCOM) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, జర్మనీలో ఉద్యోగాలు, ప్రయోజనాల గురించి వివరిస్తామని, ఎలక్ట్రిషన్ ట్రేడ్ లో 60% మార్కులు ఉండాలని, వయస్సు 19-30లోపు ఉండాలన్నారు.

News October 23, 2025

బాడీలోషన్నే ముఖానికి వాడుతున్నారా?

image

చర్మానికి తేమను అందించడానికి చాలామంది బాడీలోషన్ వాడుతుంటారు. కానీ కొంతమంది ఈ లోషన్నే ఫేస్​కి కూడా వాడుతుంటారు. దీనివల్ల ముఖంపై మొటిమలు పెరుగుతాయంటున్నారు నిపుణులు. ఇందులో వాడే కృత్రిమ పరిమళాలు మృదువుగా ఉండే ముఖ చర్మంపై అలర్జీలు రావడానికి కారణం అవుతుందంటున్నారు. కాబట్టి ముఖం కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఉత్పత్తులను వాడాలని సూచిస్తున్నారు.

News October 23, 2025

కడప జిల్లా నుంచి ఆలయాలకు ప్రత్యేక బస్సులు

image

కార్తీకమాసం సందర్భంగా భక్తులు శైవ క్షేత్రాలను దర్శించేందుకు కడప జిల్లాలోని 6 డిపోల పరిధిలో 100 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజినల్ మేనేజర్ గోపాల్‌రెడ్డి తెలిపారు. ఈ బస్సులు ఈనెల 27 నుంచి వచ్చేనెల 3, 10, 17తేదీల్లో పొలతల క్షేత్రం, నిత్యపూజ కోన, లంకమల్ల, అగస్తీశ్వర కోన, కన్యతీర్థం, నయనాలప్ప కోన, పుష్పగిరి, శ్రీశైలం తదితర క్షేత్రాలకు బస్సు సర్వీసులు భక్తులకు అందుబాటులో ఉంటాయన్నారు.