News October 23, 2025
MNCL: నవంబర్‌లో బాల వైజ్ఞానిక, ఇన్స్పైర్ ప్రాజెక్టుల ప్రదర్శన

మంచిర్యాల జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక, ఇన్స్పైర్ ప్రాజెక్టుల ప్రదర్శన నవంబర్‌లో నిర్వహించనున్నట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. 2024-25లో ఎంపిక చేసిన 108 ఇన్స్పైర్ ప్రదర్శనలను 5వ తేదీలోగా సిద్ధం చేసుకోవాలని సూచించారు. వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా కాలుష్యం తగ్గించడం అనే అంశంపై విద్యార్థులకు సెమినార్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్‌ను సంప్రదించాలని తెలిపారు.
Similar News
News October 23, 2025
వరంగల్: వారే టార్గెట్.. రూ.లక్షల్లో వసూలు..!

ఇటీవల ఆర్టీఏ చెక్‌పోస్టుల వద్ద ACB దాడులు, వరంగల్ ములుగు రోడ్డులోని మత్స్యశాఖ కార్యాలయంలో సిబ్బందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం తర్వాత, ACB అధికారులంటూ రవాణాశాఖ సిబ్బందికి కాల్స్ రావడం కలకలం రేపుతోంది. రిటైర్‌మెంట్‌కు దగ్గరలో ఉన్న అధికారులను లక్ష్యంగా చేసుకుని నకిలీ ACB అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని సమాచారం. సైబర్ మోసాలతో భయపడి కొందరు అధికారులు రూ.లక్షల్లో చెల్లించి మౌనం వహిస్తున్నారు.
News October 23, 2025
మండవల్లి: షార్ట్ సర్క్కూట్‌తో ఎలక్ట్రీషయన్ మృతి

మండవల్లి మండలం మండవల్లి గ్రామానికి చెందిన చిగురుపాటి సుకుమార్ (24) ప్రైవేట్ ఎలక్ట్రీషయన్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం పెదపాడు మండలం ఏపూరులో ఎలక్ట్రికల్ లైన్లు మార్చే పనికి వెళ్ళాడు. ఎలక్ట్రికల్ స్తంభం ఎక్కిన కొద్దిసేపటికే అతను విద్యుత్ ఘాతానికి గురై కుప్పకూలాడు. తోటి పనివారు అతన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.
News October 23, 2025
నంగునూర్: కొనుగోలు కేంద్రాలపై కోతుల దండయాత్ర

నంగునూర్ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలపై కోతులు గుంపుగా దండెత్తుతున్నాయి. వడ్ల రాశులపై కోతుల గుంపులు దండెత్తి ధాన్యాన్ని తినివేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోతులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైతులపై దాడి చేస్తుండటంతో మహిళలు, చిన్నారులు భయపడుతున్నారు. కోతుల బెడద నుంచి కాపాడాలని, మార్కెట్ సిబ్బంది తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


