News October 23, 2025
259 ట్రాన్స్‌ఫార్మర్లతో మేడారానికి విద్యుత్ వెలుగులు..!

ఈసారి జరిగే మేడారం మహా జాతరలో విద్యుత్ శాఖ భారీ ఏర్పాట్లకు సన్నద్ధమవుతోంది. 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. 259 ట్రాన్స్‌ఫార్మర్లు, 9111 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయనున్నారు. వనదేవతల గద్దెల ప్రాంగణం దేదీప్యమానంగా వెలిగేలా లైటింగ్ ఏర్పాట్లు చేయనున్నారు. 250km పొడవునా లైటింగ్ ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం టీజీ ఎన్పీడీసీఎల్ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టనుంది.
Similar News
News October 23, 2025
అందరికీ ఆదర్శం ఈ కిసాన్ చాచీ

బిహార్‌లోని ముజఫర్‌పుర్ జిల్లా సరేయాకు చెందిన 73 ఏళ్ల రాజకుమారి దేవి ఉత్సాహంగా సైకిల్‌పై ప్రయాణిస్తూ కనిపిస్తారు. గత 20ఏళ్లుగా సైకిల్‌పై వెళ్లి సమీపగ్రామాల్లోని మహిళలకు ఆధునిక వ్యవసాయం, ఊరగాయలు పెట్టడం నేర్పిస్తున్నారామె. ఆమె సేవలకుగానూ 2007లో కిసాన్ శ్రీ, 2019లో పద్మశ్రీ అవార్డులు వరించాయి. తాము ఆర్థికంగా బలపడేందుకు సాయం చేస్తున్న రాజకుమారిని అక్కడివారు ముద్దుగా కిసాన్ చాచీ అని పిలుచుకుంటారు.
News October 23, 2025
సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం 21 కంపార్ట్మెంట్ లలో భక్తులు స్వామి వారి దర్శనానికి వేచి ఉన్నారు. బుధవారం 73,853 మంది స్వామి వారిని దర్శించుకోగా.. 22,551 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 3.47 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది.
News October 23, 2025
నేడే సీతంపేటలో చివరి రోజు వేడుకలు..!

HNK జిల్లా హసన్పర్తి మండలం సీతంపేటలో దీపావళి బతుకమ్మ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. చెరువు నుంచి సేకరించిన రేగడి మట్టితో తయారు చేసిన జోడెద్దు ప్రతిమలతో గ్రామ ప్రధాన రహదారిపై బుధవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ప్రతిమలను చెరువులో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా పురుషులు కేదారేశ్వరస్వామి వ్రతాన్ని విరమించగా, యువకులు ప్రదర్శించిన కోటాలా ప్రదర్శన ఆకట్టుకుంది. మూడు రోజుల ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి.