News October 23, 2025

జగిత్యాల నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్

image

కార్తిక మాసాన్ని పురస్కరించుకుని అరుణాచలం పుణ్యక్షేత్రానికి జగిత్యాల డిపో నుంచి ప్రత్యేక RTC బస్ ఏర్పాటు చేసినట్లు DM కల్పన ఓ ప్రకటనలో తెలిపారు. NOV 3న బస్ బయల్దేరి కాణిపాకం, వేలూరు బంగారులక్ష్మీ అమ్మవారి దర్శనం, పౌర్ణమి రోజు జరిగే అరుణాచల గిరిప్రదక్షిణ అనంతరం జోగులాంబ ఆలయ దర్శనం తరువాత బస్ జగిత్యాలకు చేరుకుంటుంది. ఛార్జీ పెద్దలకు రూ.4,800, పిల్లలకు రూ.3,610లు. వివరాలకు 9014958854కు CALL. SHARE IT

Similar News

News October 23, 2025

అందరికీ ఆదర్శం ఈ కిసాన్ చాచీ

image

బిహార్​‌లోని ముజఫర్​పుర్ జిల్లా సరేయాకు చెందిన 73 ఏళ్ల రాజకుమారి దేవి ఉత్సాహంగా సైకిల్‌పై ప్రయాణిస్తూ కనిపిస్తారు. గత 20ఏళ్లుగా సైకిల్‌పై వెళ్లి సమీపగ్రామాల్లోని మహిళలకు ఆధునిక వ్యవసాయం, ఊరగాయలు పెట్టడం నేర్పిస్తున్నారామె. ఆమె సేవలకుగానూ 2007లో కిసాన్ శ్రీ, 2019లో పద్మశ్రీ అవార్డులు వరించాయి. తాము ఆర్థికంగా బలపడేందుకు సాయం చేస్తున్న రాజకుమారిని అక్కడివారు ముద్దుగా కిసాన్ చాచీ అని పిలుచుకుంటారు.

News October 23, 2025

సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం

image

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం 21 కంపార్ట్మెంట్ లలో భక్తులు స్వామి వారి దర్శనానికి వేచి ఉన్నారు. బుధవారం 73,853 మంది స్వామి వారిని దర్శించుకోగా.. 22,551 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 3.47 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది.

News October 23, 2025

నేడే సీతంపేటలో చివరి రోజు వేడుకలు..!

image

HNK జిల్లా హసన్పర్తి మండలం సీతంపేటలో దీపావళి బతుకమ్మ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. చెరువు నుంచి సేకరించిన రేగడి మట్టితో తయారు చేసిన జోడెద్దు ప్రతిమలతో గ్రామ ప్రధాన రహదారిపై బుధవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ప్రతిమలను చెరువులో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా పురుషులు కేదారేశ్వరస్వామి వ్రతాన్ని విరమించగా, యువకులు ప్రదర్శించిన కోటాలా ప్రదర్శన ఆకట్టుకుంది. మూడు రోజుల ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి.