News October 23, 2025
12 వేల మంది పోలీసుల భద్రత వలయంలో మేడారం..!

మేడారం మహా జాతరలో ఎన్ని ప్రభుత్వ శాఖలు పనిచేసినా పోలీసు డిపార్ట్‌మెంట్‌దే ప్రధాన పాత్ర. శాంతి భద్రతల పరిరక్షణ, అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాతరను జరిపించడంలో ఖాకీలే కీలకం. సమ్మక్క, సారలమ్మలను గద్దెకు చేర్చే ఘట్టం యావత్ జాతరకే హైలెట్. ట్రాఫిక్ క్లియరెన్స్, దొంగతనాల నియంత్రణ అతి పెద్ద టాస్క్‌లు. ఇలాంటి క్లిష్టమైన విధుల్లో ఉండే పోలీసులు ఈసారి 12 వేల మంది జాతర విధుల్లో భాగస్వాములు కానున్నారు.
Similar News
News October 23, 2025
వరంగల్: మార్కెట్ సమస్యలు పట్టడం లేదా..?

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్, లక్ష్మిపురం కూరగాయ, పండ్ల మార్కెట్లు, ముసలమ్మకుంట మామిడి మార్కెట్ హాల్‌లో కనీస సౌకర్యాలు లేక రైతులు ఆగ్రహంలో ఉన్నారు. మంత్రి కొండా సురేఖ, మార్కెటింగ్ శాఖ కమిషనర్ హామీలు ఇప్పటివరకు అమలు కావట్లేదు. సీసీ కెమెరాలు కూడా లేకపోవడంతో సురక్షితత సమస్య ఉంది. జిల్లా రైతులు మంత్రి, ఎమ్మెల్యేలను సమస్య పరిష్కరించేందుకు మాముల మార్కెట్‌ను పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు.
News October 23, 2025
వరంగల్: మద్యం టెండర్లకు నేడే ఆఖరు..!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మద్యం దరఖాస్తులు చేసుకునే వారికి నేడే చివరి అవకాశం అని ఎక్సైజ్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. 294 వైన్ షాపులకు గడువు పెంచిన నాటి నుంచి ఇప్పటి వరకు వందకు పైగా మాత్రమే దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లాలో బుధవారం వరకు 25 దరఖాస్తులు వచ్చాయి. నేడే చివరి రోజు కావడంతో ఔత్సాహికులు భారీగానే వస్తారని ఊహిస్తున్నారు.
News October 23, 2025
తాండూర్: ఫేక్ వీడియో కాల్స్‌తో మోసాలు.. జాగ్రత్త: డీఎస్పీ

నకిలీ వీడియో కాల్స్ ద్వారా సైబర్ మోసాలు జరుగుతున్నాయని తాండూర్ డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హెచ్చరించారు. తెలియని నంబర్ల నుంచి వీడియో కాల్స్ వస్తే స్పందించవద్దని ప్రజలకు సూచించారు. కొందరు వ్యక్తులు నగ్నంగా మాట్లాడి, ఆ దృశ్యాలను మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతుంటారని తెలిపారు. ఇలాంటి మోసాలకు భయపడకుండా వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించాలని, సైబర్ ఫిర్యాదుల కోసం ‘1930’కు కాల్ చేయాలని డీఎస్పీ కోరారు.