News October 23, 2025
ఓటీటీలోకి వచ్చేసిన ‘OG’

పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించిన ‘OG’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అర్ధరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రూ.308 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మి, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషించారు.
Similar News
News October 23, 2025
జామలో తెల్ల సుడిదోమ వల్ల నష్టాలు – నివారణ

తెల్ల సుడిదోమ ఆకుల అడుగు భాగాన వలయాకారంలో గుడ్లను పెడతాయి. ఆకులపై తెల్లని దూదిలాంటి మెత్తని పదార్ధాన్ని కప్పి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల ఆకులు ఎర్రబడి, ముడతలు పడి రాలిపోతాయి. వీటి నివారణకు రాత్రివేళ పసుపు రంగు జిగురు పూసిన అట్టలను చెట్ల వద్ద ఉంచాలి. సుడిదోమ ఆశించిన కొమ్మలను కత్తిరించి లీటరు నీటిలో 5ml వేపనూనె కలిపి పిచికారీ చేయాలి. ఇమిడాక్లోప్రిడ్-75% WGని లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
News October 23, 2025
ESIC నోయిడాలో కేవలం ఇంటర్వ్యూతోనే ఉద్యోగాలు

ESIC నోయిడా 20 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఎంబీబీఎస్, డీఎన్‌బీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవంగల వారు నవంబర్ 4న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజులో మినహాయింపు ఉంది. వెబ్‌సైట్: https://esic.gov.in/
News October 23, 2025
మళ్లీ తగ్గిన బంగారం ధరలు

ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రా.ల బంగారం ధర రూ.810 తగ్గి ₹1,25,080కు చేరింది. 22 క్యారెట్ల 10g పసిడిపై రూ.750 పతనమై ₹1,14,650గా ఉంది. అటు KG వెండిపై రూ.1,000 తగ్గి రూ.1,74,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.