News October 23, 2025

భద్రాద్రి: అన్ని రుణాలను వసూలు చేయాలి: కలెక్టర్

image

జిల్లాలోని ఏపీఎం, సీసీలతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ బుధవారం కలెక్టరేట్‌లో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. నాన్-పెర్ఫార్మెన్స్ రుణాలు, లైవ్‌హుడ్ యూనిట్ల ఏర్పాటు, చేపల, కౌజుపిట్టలు, మేకలు, నాటుకోళ్ల పెంపకం, మహిళా సమాఖ్య గ్రూపుల ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. జిల్లాలో రుణ బకాయిలను ప్రణాళికాబద్ధంగా వసూలు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

Similar News

News October 23, 2025

స్థానిక ఎన్నికలే అజెండా.. మరికొన్ని గంటల్లో క్యాబినెట్ భేటీ

image

TG: స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన అజెండాగా ఈరోజు 3PMకు క్యాబినెట్​ భేటీ కానుంది. నిలిచిపోయిన ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లపై కోర్టులు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై ఎలా ముందుకు వెళ్లాలో సీఎం, మంత్రులు చర్చించనున్నారు. ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసే చట్ట సవరణ ఆర్డినెన్స్​ ప్రతిపాదన మంత్రివర్గం ముందుకు రానుంది.

News October 23, 2025

రాజేంద్రనగర్‌‌లోని NIRDPRలో ఉద్యోగాలు

image

రాజేంద్రనగర్‌లోని NIRDPRలో పని అనుభవం ఉన్నవారికి ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారు. UG, PG, PHD చేసి, అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. రూ.50 వేల జీతంతో రీసెర్చ్ అసోసియేట్ 8 పోస్టులు, సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ ఒక పోస్టుకు రూ.లక్ష వేతనం ఇవ్వనున్నారు. ఈ 9 ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిక్ కింద భర్తీ చేస్తారు. R.Aకు 50 ఏళ్లు, SPCకి 65 ఏళ్లు మించొద్దు. OCT 29న వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది.
SHARE IT

News October 23, 2025

కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు

image

కామారెడ్డి జిల్లాలో రాత్రిపూట చలి తీవ్రత ప్రభావం క్రమంగా పెరుగుతోంది. బిచ్కుంద మండలంలో 33.8 సెంటీగ్రేడ్ కాగా.. మద్నూర్ మండలంలో 33.6, పాల్వంచ 33,5, నస్రుల్లాబాద్‌ 33, బీర్కూర్ 32.8, అత్యల్పంగా రాజంపేట మండలంలో 30.8 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత పెరుగుతున్నందున వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.