News October 23, 2025
ప్రద్యుమ్న ఫిర్యాదుపై మాగంటి సునీత ఏమన్నారంటే?

TG: ఈసీకి ప్రద్యుమ్న <<18073070>>ఫిర్యాదు<<>> చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత స్పందించారు. ఆయన ఆరోపణలు తప్పని తేల్చిచెప్పారు. తనపై కొందరు అనవసర ఆరోపణలు చేస్తున్నారని, వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు పేర్కొన్నారు. అటు నవీన్ యాదవ్ నామినేషన్‌లో కొన్ని ఖాళీలు ఉండటంపై ఫిర్యాదు చేసినట్లు BRS నేతలు వెల్లడించారు. చట్టప్రకారం పత్రాలలో ఎలాంటి ఖాళీలు ఉండకూడదని పేర్కొన్నారు.
Similar News
News October 23, 2025
నవంబర్ 3 నుంచి కాలేజీలు బంద్.. సీఎస్‌కు సమ్మె నోటీసు

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని సీఎస్‌కు ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలు సమ్మె నోటీసు ఇచ్చాయి. బకాయిలు చెల్లించకపోతే నవంబర్ 3 నుంచి కాలేజీలు బంద్ చేస్తామని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్‌స్టిట్యూషన్స్ (FATHI) హెచ్చరించింది. టోకెన్లు ఇచ్చి రూ.900 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. దీపావళికి ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
News October 23, 2025
అభ్యంగన స్నానం వెనుక ఆంతర్యమిదే!

శరీరాద్యంతము తైలమును అంటుకోవడమే అభ్యంగనం. అనగా ఆముదము గానీ, నువ్వుల నూనె గానీ, నెయ్యి, వెన్న మొదలైన ఏదో ఒక తైలమును శరీరమంతా బాగా పట్టించి కనీసం 30 నిమిషాల తర్వాత శీకాయపొడి కానీ, పెసరపిండి కానీ, శనగపిండి గానీ ఉపయోగించి గోరువెచ్చటి నీటితో స్నానము చేయాలి. ఇది ఆధ్యాత్మిక నియమమే కాదు. ఆరోగ్యకరం కూడా! అందుకే పండుగల్లో దీన్ని విధిగా ఆచరించాలని మన పెద్దలు సూచిస్తుంటారు. కార్తీక మాసంలో ఈ నియమం ముఖ్యం.
News October 23, 2025
ఇంటి చిట్కాలు

* చెత్తబుట్టలో బ్యాక్టీరియా చేరి దుర్వాసన రాకుండా ఉండాలంటే.. బుట్ట అడుగు భాగంలో కొంచెం బొరాక్స్ పొడి చల్లాలి.
* కాస్త వెనిగర్‌లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి డైనింగ్ టేబుల్ తుడిస్తే ఎలాంటి మరకలైనా పోతాయి.
* ట్యాపులపై ఉండే మచ్చలు పోయి కొత్తవాటిలా మెరవాలంటే వారానికోసారి నిమ్మకాయ ముక్కతో రుద్దాలి.
* కొవ్వొత్తులను వెలిగించే ముందు వాటి పైభాగాన కాస్త ఉప్పు రాస్తే ఎక్కువ సమయం వెలుగుతాయి.