News October 23, 2025

అన్నాచెల్లెళ్ల పండుగ.. శుభ సమయం ఏదంటే?

image

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన ‘భాయ్ దూజ్’ పర్వదినాన, సోదరీమణుల చేతి భోజనం సోదరులకు దీర్ఘాయుష్షును ప్రసాదిస్తుందని పండితులు ఉద్ఘాటిస్తున్నారు. ఈ దివ్య ఆచరణకు ఉదయం సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శుభ సమయం అని సూచిస్తున్నారు. సాయంకాలం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఈ భగినీ హస్త భోజన ఘట్టాన్ని ఆచరించడానికి సమయం అనుకూలంగా ఉందంటున్నారు. ఈ పండుగ కుటుంబ బంధాలను దృఢపరుస్తుంది.

Similar News

News October 23, 2025

ఆర్టీసీలో ఇకపై అన్నీ విద్యుత్తు వాహనాలే

image

AP: RTCలో ప్రస్తుత బస్సుల స్థానంలో విద్యుత్ వాహనాలు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై CM CBN APSRTCకి ఆదేశాలిచ్చారు. ప్రతి 30 KMకి 1 ఛార్జింగ్ స్టేషన్‌, ఈ-మొబిలిటీ స్టార్టప్‌ల ప్రోత్సాహానికి 100 ఇన్‌క్యుబేషన్ కేంద్రాలు నెలకొల్పుతారు. E-VEHICLE ప్రాజెక్టు కోసం ₹500 CR ఇవ్వనున్నారు. కేంద్ర ‘PM E-DRIVE’ స్కీమ్ కింద ఉన్న ₹10,900 కోట్ల ఫండ్‌ను అందిపుచ్చుకొనేలా ప్రణాళికను రూపొందిస్తున్నారు.

News October 23, 2025

బాలింతలు ఏం తినాలంటే?

image

ఒక మహిళ జీవితంలో ఎక్కువ కెలోరీలు అవసరమయ్యేది బాలింత దశలోనే. బిడ్డకు పాలివ్వడం వల్ల ఆకలి ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ సమయంలో సమతులాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా టిఫిన్, లంచ్, డిన్నర్ మధ్యలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఫ్రూట్స్, నట్స్ తీసుకోవాలి. మిల్లెట్స్ జావలు, సూప్స్, చికెన్, చేపలు ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వులు, చక్కెర, ఉప్పులున్న ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలి.

News October 23, 2025

ఏపీలో హైస్పీడ్ రైళ్లు రయ్…రయ్…

image

AP: రానున్న రోజుల్లో రాష్ట్రంలో హైస్పీడ్ రైళ్లు పరుగెత్తనున్నాయి. కేంద్రం చేపట్టే 2 హైస్పీడ్ రైల్ కారిడార్లు AP మీదుగా వెళ్లనున్నాయి. HYD-చెన్నై కారిడార్ పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో 263 KM మేర వెళ్లనుంది. HYD-బెంగళూరు కారిడార్ కర్నూలు, నంద్యాల, ATP, సత్యసాయి జిల్లాల్లో 504 KM మేర వెళ్తుంది. ఈ రూట్లలో 15 స్టేషన్లు ఏర్పాటుకానుండడంతో జర్నీటైమ్ తగ్గనుంది.