News October 23, 2025

తిరుపతి జిల్లాలో వర్షాలు.. ఇవి గుర్తుంచుకోండి

image

➤ నేటి నుంచి 3రోజులు భారీ వర్షాలు
➤ అత్యవసరమైతే ఇళ్ల నుంచి బయటకు రండి
➤ బీచ్‌లకు వెళ్లడం, చేపలవేట నిషేధం
➤ వర్షాల సమయంలో టీవీలు, ఫ్రిడ్జ్‌లు ఆపేయండి
➤వాగులు, కాలువలు, చెరువుల వద్దకు వెళ్లకండి
➤కలెక్టరేట్ నంబర్: 0877226007
➤పోలీస్ కంట్రోల్ రూమ్: 112, 8099999970

Similar News

News October 23, 2025

మొక్కజొన్న కంకి త్వరగా ఎండటానికి ఇలా చేస్తున్నారు

image

మొక్కజొన్న కంకి మొక్కకే ఉండి త్వరగా ఎండిపోవడానికి కొందరు రైతులు వినూత్న విధానం అనుసరిస్తున్నారు. మొక్కకు కంకి ఉండగానే.. ఆ మొక్క కర్రకు ఉన్న ఆకులు అన్నింటిని కత్తిరిస్తున్నారు. ఇలా కత్తిరించిన ఆకులను పశుగ్రాసంగా వినియోగిస్తున్నారు. దీని వల్ల కంకి త్వరగా ఎండిపోవడంతో పాటు నేల కూడా త్వరగా ఆరుతోందని చెబుతున్నారు రైతులు. ఆదిలాబాద్ జిల్లాలోని కొందరు మొక్కజొన్న రైతులు ఈ విధానం అనుసరిస్తున్నారు.

News October 23, 2025

కోహ్లీ గెస్చర్ దేనికి సంకేతం?

image

AUSతో రెండో వన్డేలో డకౌటై వెళ్తూ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చిన ఫ్యాన్స్‌కు కోహ్లీ చేతిని పైకి చూపిస్తూ థాంక్స్ చెప్పారు. అయితే దీనిపై SMలో చర్చ జరుగుతోంది. రన్ మెషీన్ అడిలైడ్‌లో చివరి మ్యాచ్ ఆడేశారని, అందుకే ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలిపారని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అటు సిరీస్ తర్వాత రిటైర్ కానున్నారని, అదే హింట్ ఇచ్చారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. తొలి వన్డేలోనూ కోహ్లీ ‘0’కే ఔటయ్యారు.

News October 23, 2025

ADB: అవినీతీ.. చెక్‌పొస్టులు క్లోజ్

image

రాష్ట్రంలోని చెకోపోస్టుల్లో భారీగా అవినీతి జరుగుతోంది. ఇటీవల ఏసీబీ అధికారులు భోరజ్, బెల్తారోడా, వాంకిడి ఆర్టీఏ చెక్‌పోస్టులపై దాడులు చేపట్టి నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో అవినీతికి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం అన్ని చెక్‌పోస్టులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇస్తున్న అనుమతులు ఇక నుంచి ఆన్‌లైన్ ద్వారాఇవ్వనుంది. రవాణాశాఖ నిరంతరం పర్యవేక్షించనుంది.