News October 23, 2025
ఏడో తరగతి అర్హతతో ఉద్యోగాలు

జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఒక సంవత్సరం పాటు తాత్కాలిక నియామకం కోసం నోటిఫికేషన్ ప్రకటించినట్లు కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి తెలిపారు. ఏడో తరగతి పాస్ లేదా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన అభ్యర్థులు అర్హులన్నారు. దరఖాస్తులు నవంబర్ 1 సాయంత్రం 5 గంటలలోపు కర్నూలు జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు సమర్పించాలన్నారు.
Similar News
News October 23, 2025
ADB: అవినీతీ.. చెక్‌పొస్టులు క్లోజ్

రాష్ట్రంలోని చెకోపోస్టుల్లో భారీగా అవినీతి జరుగుతోంది. ఇటీవల ఏసీబీ అధికారులు భోరజ్, బెల్తారోడా, వాంకిడి ఆర్టీఏ చెక్‌పోస్టులపై దాడులు చేపట్టి నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో అవినీతికి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం అన్ని చెక్‌పోస్టులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇస్తున్న అనుమతులు ఇక నుంచి ఆన్‌లైన్ ద్వారాఇవ్వనుంది. రవాణాశాఖ నిరంతరం పర్యవేక్షించనుంది.
News October 23, 2025
మైలవరంలో రేపు జాబ్ మేళా రద్దు

మైలవరం పట్టణ పరిధిలోని లక్కిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రేపు (అక్టోబర్ 24) జరగవలసిన మెగా జాబ్ మేళాను ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రద్దు చేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కార్యాలయం వారు తెలిపారు. తిరిగి ఈ మెగా జాబ్ మేళాను ఈ నెల 31వ తేదీన నిర్వహిస్తున్నట్లు వారు ప్రకటించారు. కావున నిరుద్యోగులు అందరూ గమనించవలసిందిగా కోరారు.
News October 23, 2025
రంగారెడ్డి: బెగ్గింగ్ చేసి మరీ బోర్ రిపేర్!

తమ హయాంలో ఎంతో అభివృద్ధి జరిగిందని పాలకులు చెబుతుంటారు. ఇది సాదారణమే కానీ, తండాల్లో చిన్న సమస్య వస్తే GPల్లో నిధులు లేని దుస్థితి కనిపిస్తోంది. అవును.. తలకొండపల్లి మం. హర్యానాయక్ తండాలో నీటి మోటరు కాలిపోయింది. పంచాయతీ కార్యదర్శిని అడిగితే నిధులు లేవని సమాధానం వచ్చింది. దీంతో నీటి సమస్య తీర్చాలని కొందరు యువకులు ఇంటింటికి తిరిగి భిక్షాటన చేశారు. జమ అయిన రూ.5000తో బోరు రిపేర్ చేయించడం గమనార్హం.