News October 23, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: 36 మంది నామినేషన్లు రిజెక్ట్

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నామినేషన్ల స్క్రూటీని కొనసాగుతోంది. నిన్న రాత్రి 7 గంటల వరకు 36 మంది అభ్యర్థుల 69 సెట్ల నామినేషన్లు తిరస్కరించారు. 45 మంది నామినేషన్లు ఆమోదించారు. నేడు ఉదయం నుంచి కూడా స్క్రూటినీ జరగనుంది. రేపు నామినేషన్ల ఉపసంహరణకు అధికారులు అవకాశం కల్పించారు. INC, BRS, BJP అభ్యర్థుల నామినేషన్లకు రిటర్నింగ్ ఆఫీసర్ ఆమోదం తెలిపారు.

Similar News

News October 23, 2025

పోచారంలో కాల్పులు.. CP క్లారిటీ

image

పోచారంలో‌ కాల్పుల ఘటనపై రాచకొండ CP సుధీర్ బాబు క్లారిటీ ఇచ్చారు. పాతకక్షల కారణంగా జరిగిన దాడి అంటూ స్పష్టం చేశారు. ‘ప్రశాంత్‌ చెప్పిన ప్లేస్‌ అయిన టీ స్టాల్ వద్దకు ఇబ్రహీం, మోసిన్, శ్రీనివాస్ వచ్చారు. ఇంతకుముందే వీళ్లకు ఇంటరాక్షన్ ఉంది. ఇబ్రహీంకు ప్రశాంత్ వల్ల రూ.కోటి నష్టం జరిగింది. ఇదే బుధవారం సాయంత్రం కాల్పులకు దారి తీసింది. నిందితులను అరెస్ట్ చేశాం. ఒకరు పరారీలో ఉన్నారు’ అని CP తెలిపారు.

News October 23, 2025

రంగారెడ్డి: బెగ్గింగ్ చేసి మరీ బోర్ రిపేర్!

image

తమ హయాంలో ఎంతో అభివృద్ధి జరిగిందని పాలకులు చెబుతుంటారు. ఇది సాదారణమే కానీ, తండాల్లో చిన్న సమస్య వస్తే GPల్లో నిధులు లేని దుస్థితి కనిపిస్తోంది. అవును.. తలకొండపల్లి మం. హర్యానాయక్ తండాలో నీటి మోటరు కాలిపోయింది. పంచాయతీ కార్యదర్శిని అడిగితే నిధులు లేవని సమాధానం వచ్చింది. దీంతో నీటి సమస్య తీర్చాలని కొందరు యువకులు ఇంటింటికి తిరిగి భిక్షాటన చేశారు. జమ అయిన రూ.5000తో బోరు రిపేర్ చేయించడం గమనార్హం.

News October 23, 2025

జూబ్లీహిల్స్‌లో 100 మంది రౌడీషీటర్లు!

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ పోలీసులు రౌడీ షీటర్ల వివరాలపై ఆరా తీస్తున్నారు. ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా నిఘా పెట్టారు. నియోజకవర్గ పరిధిలో 100 మంది రౌడీ షీటర్లు ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. జూబ్లీ‌హిల్స్ PS పరిధిలో ఇద్దరు, సనత్‌నగర్‌లో ఒక్కరు, మధురానగర్‌లో 19 మంది, గోల్కొండలో ఒక్కరు, బోరబండలో 71 మంది, టోలిచౌకిలో నలుగురు, పంజాగుట్టలో ఇద్దరు ఉన్నారు.