News October 23, 2025

విజయవాడ రైల్వే డివిజన్‌కు డబ్బే.. డబ్బు!

image

విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో SEP 21వ తేదీ నుంచి OCT 21 వరకు దసరా, దీపావళి, ఛత్ పూజ పండుగల నేపథ్యంలో మొత్తం 263 ప్రత్యేక రైళ్లను నడిపినట్లు డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా తెలిపారు. సుమారు నెల రోజులకు గాను రూ.563 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందన్నారు. గతంతో పోల్చుకుంటే ఆదాయం గణనీయంగా పెరిగిందని చెప్పారు. VJA, రాజమండ్రి, నెల్లూరు, గూడూరు వంటి ప్రధాన స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లను నడిపామన్నారు.

Similar News

News October 23, 2025

UCO బ్యాంక్‌లో 532 పోస్టులు

image

యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్(UCO) 532 అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 20 -28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి సడలింపు ఉంది. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.uco.bank.in/
✍️ మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 23, 2025

మొక్కజొన్న కంకి త్వరగా ఎండటానికి ఇలా చేస్తున్నారు

image

మొక్కజొన్న కంకి మొక్కకే ఉండి త్వరగా ఎండిపోవడానికి కొందరు రైతులు వినూత్న విధానం అనుసరిస్తున్నారు. మొక్కకు కంకి ఉండగానే.. ఆ మొక్క కర్రకు ఉన్న ఆకులు అన్నింటిని కత్తిరిస్తున్నారు. ఇలా కత్తిరించిన ఆకులను పశుగ్రాసంగా వినియోగిస్తున్నారు. దీని వల్ల కంకి త్వరగా ఎండిపోవడంతో పాటు నేల కూడా త్వరగా ఆరుతోందని చెబుతున్నారు రైతులు. ఆదిలాబాద్ జిల్లాలోని కొందరు మొక్కజొన్న రైతులు ఈ విధానం అనుసరిస్తున్నారు.

News October 23, 2025

కోహ్లీ గెస్చర్ దేనికి సంకేతం?

image

AUSతో రెండో వన్డేలో డకౌటై వెళ్తూ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చిన ఫ్యాన్స్‌కు కోహ్లీ చేతిని పైకి చూపిస్తూ థాంక్స్ చెప్పారు. అయితే దీనిపై SMలో చర్చ జరుగుతోంది. రన్ మెషీన్ అడిలైడ్‌లో చివరి మ్యాచ్ ఆడేశారని, అందుకే ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలిపారని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అటు సిరీస్ తర్వాత రిటైర్ కానున్నారని, అదే హింట్ ఇచ్చారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. తొలి వన్డేలోనూ కోహ్లీ ‘0’కే ఔటయ్యారు.