News October 23, 2025

259 ట్రాన్స్‌ఫార్మర్లతో మేడారానికి విద్యుత్ వెలుగులు..!

image

ఈసారి జరిగే మేడారం మహా జాతరలో విద్యుత్ శాఖ భారీ ఏర్పాట్లకు సన్నద్ధమవుతోంది. 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. 259 ట్రాన్స్‌ఫార్మర్లు, 9111 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయనున్నారు. వనదేవతల గద్దెల ప్రాంగణం దేదీప్యమానంగా వెలిగేలా లైటింగ్ ఏర్పాట్లు చేయనున్నారు. 250km పొడవునా లైటింగ్ ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం టీజీ ఎన్పీడీసీఎల్ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టనుంది.

Similar News

News October 23, 2025

391 కానిస్టేబుల్ పోస్టులు.. అప్లై చేశారా?

image

BSF స్పోర్ట్స్ కోటాలో 391 కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్, ఇంటర్ విద్యార్హతతోపాటు నేషనల్, ఇంటర్నేషన్ గేమ్స్‌లో రాణించిన వారు అర్హులు. వయసు 18-23ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంది. దరఖాస్తుకు ఆఖరు తేదీ నవంబర్ 4. PST, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్, స్పోర్ట్స్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక ఉంటుంది. వెబ్‌సైట్: https://rectt.bsf.gov.in/

News October 23, 2025

ఏపీలో 23 ఉద్యోగాలు

image

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో 23 ఉద్యోగాలకు షార్ట్ నోటిఫికేషన్ వెలువడింది. బోధన కేటగిరీలోని 10 విభాగాల్లో, బోధనేతర కేటగిరీలోని 10 విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. విద్యార్హతలు, అనుభవం తదితర వివరాలను త్వరలో https://nsktu.ac.in వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. దరఖాస్తులకు నవంబర్ 30 ఆఖరు తేదీ.

News October 23, 2025

పోచారంలో కాల్పులు.. CP క్లారిటీ

image

పోచారంలో‌ కాల్పుల ఘటనపై రాచకొండ CP సుధీర్ బాబు క్లారిటీ ఇచ్చారు. పాతకక్షల కారణంగా జరిగిన దాడి అంటూ స్పష్టం చేశారు. ‘ప్రశాంత్‌ చెప్పిన ప్లేస్‌ అయిన టీ స్టాల్ వద్దకు ఇబ్రహీం, మోసిన్, శ్రీనివాస్ వచ్చారు. ఇంతకుముందే వీళ్లకు ఇంటరాక్షన్ ఉంది. ఇబ్రహీంకు ప్రశాంత్ వల్ల రూ.కోటి నష్టం జరిగింది. ఇదే బుధవారం సాయంత్రం కాల్పులకు దారి తీసింది. నిందితులను అరెస్ట్ చేశాం. ఒకరు పరారీలో ఉన్నారు’ అని CP తెలిపారు.