News October 23, 2025

జూబ్లీహిల్స్‌లో ప్రచారం.. ప్రతి పైసా లెక్క చెప్పాలి!

image

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో అభ్యర్థులు ప్రచారం కోసం చేసే ప్రతి పైసాను లెక్కించి అభ్యర్థుల ఖాతాలో జమ చేయాలని వ్యయ పరిశీలకులు సంజీవ్ కుమార్ లాల్ అధికారులకు సూచించారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంసీఎంసీ, ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ రూమ్‌లను తనిఖీ చేశారు. అభ్యర్థుల పెయిడ్ న్యూస్‌పై నిఘా ఉంచాలన్నారు. ర్యాలీలు, సభలు, రోడ్ షోలను రికార్డింగ్ చేయాలన్నారు.

Similar News

News October 23, 2025

పోచారంలో కాల్పులు.. CP క్లారిటీ

image

పోచారంలో‌ కాల్పుల ఘటనపై రాచకొండ CP సుధీర్ బాబు క్లారిటీ ఇచ్చారు. పాతకక్షల కారణంగా జరిగిన దాడి అంటూ స్పష్టం చేశారు. ‘ప్రశాంత్‌ చెప్పిన ప్లేస్‌ అయిన టీ స్టాల్ వద్దకు ఇబ్రహీం, మోసిన్, శ్రీనివాస్ వచ్చారు. ఇంతకుముందే వీళ్లకు ఇంటరాక్షన్ ఉంది. ఇబ్రహీంకు ప్రశాంత్ వల్ల రూ.కోటి నష్టం జరిగింది. ఇదే బుధవారం సాయంత్రం కాల్పులకు దారి తీసింది. నిందితులను అరెస్ట్ చేశాం. ఒకరు పరారీలో ఉన్నారు’ అని CP తెలిపారు.

News October 23, 2025

రంగారెడ్డి: బెగ్గింగ్ చేసి మరీ బోర్ రిపేర్!

image

తమ హయాంలో ఎంతో అభివృద్ధి జరిగిందని పాలకులు చెబుతుంటారు. ఇది సాదారణమే కానీ, తండాల్లో చిన్న సమస్య వస్తే GPల్లో నిధులు లేని దుస్థితి కనిపిస్తోంది. అవును.. తలకొండపల్లి మం. హర్యానాయక్ తండాలో నీటి మోటరు కాలిపోయింది. పంచాయతీ కార్యదర్శిని అడిగితే నిధులు లేవని సమాధానం వచ్చింది. దీంతో నీటి సమస్య తీర్చాలని కొందరు యువకులు ఇంటింటికి తిరిగి భిక్షాటన చేశారు. జమ అయిన రూ.5000తో బోరు రిపేర్ చేయించడం గమనార్హం.

News October 23, 2025

జూబ్లీహిల్స్‌లో 100 మంది రౌడీషీటర్లు!

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ పోలీసులు రౌడీ షీటర్ల వివరాలపై ఆరా తీస్తున్నారు. ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా నిఘా పెట్టారు. నియోజకవర్గ పరిధిలో 100 మంది రౌడీ షీటర్లు ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. జూబ్లీ‌హిల్స్ PS పరిధిలో ఇద్దరు, సనత్‌నగర్‌లో ఒక్కరు, మధురానగర్‌లో 19 మంది, గోల్కొండలో ఒక్కరు, బోరబండలో 71 మంది, టోలిచౌకిలో నలుగురు, పంజాగుట్టలో ఇద్దరు ఉన్నారు.