News October 23, 2025
జూబ్లీహిల్స్‌లో ప్రచారం.. ప్రతి పైసా లెక్క చెప్పాలి!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో అభ్యర్థులు ప్రచారం కోసం చేసే ప్రతి పైసాను లెక్కించి అభ్యర్థుల ఖాతాలో జమ చేయాలని వ్యయ పరిశీలకులు సంజీవ్ కుమార్ లాల్ అధికారులకు సూచించారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంసీఎంసీ, ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ రూమ్‌లను తనిఖీ చేశారు. అభ్యర్థుల పెయిడ్ న్యూస్‌పై నిఘా ఉంచాలన్నారు. ర్యాలీలు, సభలు, రోడ్ షోలను రికార్డింగ్ చేయాలన్నారు.
Similar News
News October 23, 2025
391 కానిస్టేబుల్ పోస్టులు.. అప్లై చేశారా?

BSF స్పోర్ట్స్ కోటాలో 391 కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్, ఇంటర్ విద్యార్హతతోపాటు నేషనల్, ఇంటర్నేషన్ గేమ్స్‌లో రాణించిన వారు అర్హులు. వయసు 18-23ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంది. దరఖాస్తుకు ఆఖరు తేదీ నవంబర్ 4. PST, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్, స్పోర్ట్స్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక ఉంటుంది. వెబ్‌సైట్: https://rectt.bsf.gov.in/
News October 23, 2025
ఏపీలో 23 ఉద్యోగాలు

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో 23 ఉద్యోగాలకు షార్ట్ నోటిఫికేషన్ వెలువడింది. బోధన కేటగిరీలోని 10 విభాగాల్లో, బోధనేతర కేటగిరీలోని 10 విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. విద్యార్హతలు, అనుభవం తదితర వివరాలను త్వరలో https://nsktu.ac.in వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. దరఖాస్తులకు నవంబర్ 30 ఆఖరు తేదీ.
News October 23, 2025
పోచారంలో కాల్పులు.. CP క్లారిటీ

పోచారంలో కాల్పుల ఘటనపై రాచకొండ CP సుధీర్ బాబు క్లారిటీ ఇచ్చారు. పాతకక్షల కారణంగా జరిగిన దాడి అంటూ స్పష్టం చేశారు. ‘ప్రశాంత్ చెప్పిన ప్లేస్ అయిన టీ స్టాల్ వద్దకు ఇబ్రహీం, మోసిన్, శ్రీనివాస్ వచ్చారు. ఇంతకుముందే వీళ్లకు ఇంటరాక్షన్ ఉంది. ఇబ్రహీంకు ప్రశాంత్ వల్ల రూ.కోటి నష్టం జరిగింది. ఇదే బుధవారం సాయంత్రం కాల్పులకు దారి తీసింది. నిందితులను అరెస్ట్ చేశాం. ఒకరు పరారీలో ఉన్నారు’ అని CP తెలిపారు.