News October 23, 2025
IAS రిజ్వీ VRS.. సంచలనంగా మంత్రి లేఖ!

TG: వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ స్వచ్ఛంద పదవీ విరమణ, ఆయనపై మంత్రి జూపల్లి CSకు లేఖ రాయడం సంచలనంగా మారింది. 1999 IAS బ్యాచ్‌కు చెందిన రిజ్వీ మరో పదేళ్ల సర్వీస్ ఉండగానే VRS తీసుకున్నారు. మద్యం బాటిళ్లపై వేసే హోలోగ్రామ్ లేబుల్స్‌కు కొత్త టెండర్లు పిలవాలని ఆదేశించినా రిజ్వీ పాతవారికే అవకాశం ఇచ్చారని మంత్రి లేఖలో పేర్కొన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Similar News
News October 23, 2025
కరప్షన్, క్రైమ్.. ఇవే NDA డబుల్ ఇంజిన్లు: తేజస్వీ

ఎన్డీయే ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కలిసి పని చేస్తామని ఆర్జేడీ నేత, మహాఘట్‌బంధన్ <<18080695>>సీఎం అభ్యర్థి<<>> తేజస్వీ యాదవ్ అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారులో ఒక ఇంజిన్ కరప్షన్, మరోది క్రైమ్ అని ఎద్దేవా చేశారు. బిహార్‌లో నేరాలు పెరిగిపోతున్నాయని, 200 రౌండ్ల కాల్పులు జరగని రోజంటూ లేదని అన్నారు. కొత్త బిహార్ నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. NDA సీఎం అభ్యర్థి ఎవరో BJP, అమిత్ షా క్లారిటీ ఇవ్వాలన్నారు.
News October 23, 2025
టాస్ గెలిచిన న్యూజిలాండ్

ఉమెన్స్ వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా, న్యూజిలాండ్ జట్లు నవీ ముంబై వేదికగా తలపడనున్నాయి. టాస్ గెలిచిన NZW జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
INDW ప్లేయింగ్ Xl: ప్రతీకా, స్మృతి మంధాన, హర్లీన్, హర్మన్‌ప్రీత్(C), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి, రిచా, స్నేహ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్
NZW: సుజీ బేట్స్, జార్జియా, అమేలియా, సోఫీ(C), బ్రూక్ హాలిడే, మాడీ గ్రీన్, ఇసాబెల్లా, జెస్ కెర్, రోజ్మేరీ, లియా, ఈడెన్ కార్సన్
News October 23, 2025
220 క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్

జల్గావ్ DCC బ్యాంకులో 220 క్లర్క్(సపోర్ట్ స్టాఫ్) ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ/పీజీ పాసైన వారు అర్హులు. 21-35 ఏళ్ల వయసు ఉండాలి. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 31. అప్లికేషన్ ఫీజు రూ.1,000. ఆన్‌లైన్ టెస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వెబ్‌సైట్: https://jdccbank.com/