News October 23, 2025

నక్కపల్లి: రేపు రాజయ్యపేటలో పర్యటించనున్న కలెక్టర్

image

జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఈ నెల 24న రాజయ్యపేటలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని నక్కపల్లి తహసిల్దార్ నరసింహా మూర్తి బుధవారం తెలిపారు. బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాలని మత్స్యకారులు గ్రామంలో రిలే దీక్షలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈనెల 19న గ్రామానికి వస్తానని కలెక్టర్ సమాచారం ఇచ్చారు. అయితే సమయం తక్కువగా ఉన్నందున మరో రోజు రావాలని మత్స్యకారులు విజ్ఞప్తి చేశారు.

Similar News

News October 23, 2025

GNT: భారీ వర్షాలకు అప్రమత్తమైన అధికార యంత్రాంగం

image

తీవ్ర అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నందున జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గుంటూరు కలెక్టరేట్‌లో కలెక్టర్ తమీమ్ అన్సారియా గురువారం ఉదయం నుంచి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆకస్మిక వరదల పట్ల ప్రజలను అప్రమత్తంగా చేయాలని, చెట్లు, భారీ హోర్డింగ్లు, శిథిల భవనాల వద్ద ఉంచవద్దని సూచించారు. అత్యవసరమైతే గుంటూరు కలెక్టరేట్ నెంబర్ 08632234990కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

News October 23, 2025

టాస్ గెలిచిన న్యూజిలాండ్

image

ఉమెన్స్ వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా, న్యూజిలాండ్ జట్లు నవీ ముంబై వేదికగా తలపడనున్నాయి. టాస్ గెలిచిన NZW జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
INDW ప్లేయింగ్ Xl: ప్రతీకా, స్మృతి మంధాన, హర్లీన్, హర్మన్‌ప్రీత్(C), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి, రిచా, స్నేహ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్
NZW: సుజీ బేట్స్, జార్జియా, అమేలియా, సోఫీ(C), బ్రూక్ హాలిడే, మాడీ గ్రీన్, ఇసాబెల్లా, జెస్ కెర్, రోజ్మేరీ, లియా, ఈడెన్ కార్సన్

News October 23, 2025

కరప్షన్, క్రైమ్.. ఇవే NDA డబుల్ ఇంజిన్లు: తేజస్వీ

image

ఎన్డీయే ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కలిసి పని చేస్తామని ఆర్జేడీ నేత, మహాఘట్‌బంధన్ <<18080695>>సీఎం అభ్యర్థి<<>> తేజస్వీ యాదవ్ అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారులో ఒక ఇంజిన్ కరప్షన్, మరోది క్రైమ్ అని ఎద్దేవా చేశారు. బిహార్‌లో నేరాలు పెరిగిపోతున్నాయని, 200 రౌండ్ల కాల్పులు జరగని రోజంటూ లేదని అన్నారు. కొత్త బిహార్ నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. NDA సీఎం అభ్యర్థి ఎవరో BJP, అమిత్ షా క్లారిటీ ఇవ్వాలన్నారు.