News October 23, 2025
మండవల్లి: షార్ట్ సర్క్కూట్‌తో ఎలక్ట్రీషయన్ మృతి

మండవల్లి మండలం మండవల్లి గ్రామానికి చెందిన చిగురుపాటి సుకుమార్ (24) ప్రైవేట్ ఎలక్ట్రీషయన్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం పెదపాడు మండలం ఏపూరులో ఎలక్ట్రికల్ లైన్లు మార్చే పనికి వెళ్ళాడు. ఎలక్ట్రికల్ స్తంభం ఎక్కిన కొద్దిసేపటికే అతను విద్యుత్ ఘాతానికి గురై కుప్పకూలాడు. తోటి పనివారు అతన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.
Similar News
News October 23, 2025
చిన్నారులకు నాన్‌వెజ్ ఎప్పుడు పెట్టాలంటే?

పిల్లల ఎదుగుదలలో ఆహారం కీలకపాత్ర పోషిస్తోంది. ఆరునెలల నుంచి పిల్లలకు నెమ్మదిగా ఘనాహారం అలవాటు చెయ్యాలని నిపుణులు సూచిస్తున్నారు. 8నెలల నుంచి మాంసాహారం ఇవ్వాలి. ముందుగా ఉడికించిన గుడ్డును, సంవత్సరం దాటిన తర్వాత చికెన్, చేపలు పెట్టాలి. వాటిని బాగా ఉడికించి మెత్తగా చేసి పిల్లలకు పెట్టాలని చెబుతున్నారు. మాంసాహారంలో ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి వాటిని పిల్లలకు అలవాటు చెయ్యాలంటున్నారు.
News October 23, 2025
హుజూర్‌నగర్ జాబ్ మేళా ఏర్పాట్లు పరిశీలన

ఈ నెల 25న హుజూర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్ సారథ్యంలో జరగనున్న మెగా జాబ్ మేళా ఏర్పాట్లను కలెక్టర్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ పరిశీలించారు. ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డితో కలిసి వారు ఏర్పాట్లను సమీక్షించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. మార్కెట్ ఛైర్మన్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
News October 23, 2025
వయోవృద్ధులకు సేవ చేయడమే నిజమైన పూజ: కలెక్టర్

బోరిగామ జడ్పీఎస్‌ఎస్‌లో ‘ఆరోగ్య పాఠశాల’లో భాగంగా, ‘హెల్ప్ ఏజ్ ఇండియా’ నిర్వహించిన ‘గ్రాండ్ పేరెంట్స్ పాద పూజ’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. వయోవృద్ధులకు సేవ చేయడమే నిజమైన పూజ అన్నారు. అనంతరం వృద్ధుల సంక్షేమం, సమస్యల పరిష్కారంపై జరిగిన వర్క్‌షాప్‌లో మాట్లాడారు. ఈ కార్యక్రమాలలో డీడబ్ల్యూఓ మిల్కా, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.