News October 23, 2025
అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు : నెల్లూరు ఎస్పీ

జిల్లావ్యాప్తంగా నేటి నుంచి 25వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి వెళ్లొద్దని ఎస్పీ డా అజిత వేజెండ్ల ఒక ప్రకటనలో తెలిపారు. సముద్ర తీర పర్యాటకం నిషేధించామని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. పాత ఇళ్లల్లో జాగ్రత్తగా ఉండాలని, తడిచిన చేతులతో విద్యుత్ వస్తువులు తాకరాదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 112 నెంబర్‌కు కాల్ చేయాలన్నారు.
Similar News
News October 23, 2025
Way2News వార్తకు స్పందించిన రూరల్ ఎమ్మెల్యే

Way2News వార్తకు నెల్లూరు ఎమ్మెల్యే స్పందించారు. బుధవారం <<18069637>>కోటంరెడ్డి సార్.. పొట్టేపాలెం కాలువ తీయండి..!<<>> అనే వార్త Way2Newsలో కథనం ప్రచురితమైంది. దీంతో ఎమ్మెల్యే స్పందించి చర్యలు చేపట్టారు. గురువారం నెల్లూరు నుంచి పొట్టేపాళెంకు వెళ్లే ప్రధాన రహదారిని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. వర్షపు నీరు తొలగించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
News October 23, 2025
VIDEO.. సోమశిల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

సోమశిల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో నుంచి వస్తున్న వర్షపు నీరు డ్యామ్ నిర్ధిష్ట స్థాయికి చేరుకుంటుంది. దీంతో దిగువ పెన్నా డెల్టాకు 32,650 నీటిని విడుదల చేస్తున్నారు. సుమారు 70 టీఎంసీల నీరు డ్యామ్‌లో ఉందని అధికారులు వెల్లడించారు.
News October 23, 2025
ఊపిరి పీల్చుకున్న నెల్లూరు.. వర్షం ముప్పు తప్పునట్టేనా!

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజుల నుంచి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే అందుకు భిన్నంగా నెల్లూరులో వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రి నుంచి చిన్నచిన్న చినుకులు మినహా వర్షం పడలేదు. ఉదయం నుంచి ఎండ కాస్తోంది. దీంతో తుఫాను ముప్పు తప్పినట్టేనని జిల్లా వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు.