News October 23, 2025

ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీలో 88 పోస్టులు

image

ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ 88 అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, బీఈ, బీటెక్, డిప్లొమా, ఎంఎస్సీ, B.LSc అర్హతగల అభ్యర్థులు ఈ నెల 26వరకు అప్లై చేసుకోవచ్చు. ముందుగా NATS పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలి. అనంతరం దరఖాస్తు ఫారం, డాక్యుమెంట్స్ పోస్ట్ చేయాలి. వెబ్‌సైట్: https://dtu.ac.in/

Similar News

News October 23, 2025

చిన్నారులకు నాన్‌వెజ్ ఎప్పుడు పెట్టాలంటే?

image

పిల్లల ఎదుగుదలలో ఆహారం కీలకపాత్ర పోషిస్తోంది. ఆరునెలల నుంచి పిల్లలకు నెమ్మదిగా ఘనాహారం అలవాటు చెయ్యాలని నిపుణులు సూచిస్తున్నారు. 8నెలల నుంచి మాంసాహారం ఇవ్వాలి. ముందుగా ఉడికించిన గుడ్డును, సంవత్సరం దాటిన తర్వాత చికెన్, చేపలు పెట్టాలి. వాటిని బాగా ఉడికించి మెత్తగా చేసి పిల్లలకు పెట్టాలని చెబుతున్నారు. మాంసాహారంలో ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి వాటిని పిల్లలకు అలవాటు చెయ్యాలంటున్నారు.

News October 23, 2025

స్వదేశీ సత్తా.. ట్రాకింగ్‌లో ‘రియా’ అద్భుతం!

image

ప్రధాని మోదీ ఇచ్చిన స్వదేశీ నినాద స్ఫూర్తితో BSF శిక్షణ ఇచ్చిన స్వదేశీ జాతి శునకాలు సత్తా చాటాయి. టేకాన్‌పూర్ నేషనల్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పొందిన ‘రియా’ అనే భారతీయ శునకం 116 విదేశీ జాతులను అధిగమించింది. ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో ‘రియా’ ఏకంగా ‘బెస్ట్ ట్రాకర్ ట్రేడ్ డాగ్’ & ‘డాగ్ ఆఫ్ ది మీట్’ అనే రెండు టైటిల్స్‌ను గెలుచుకుంది. ఈ ఘనత సాధించిన తొలి స్వదేశీ శునకం ఇదే కావడం విశేషం.

News October 23, 2025

థైరాయిడ్ పేషెంట్లకు ఈ ఆహారం మంచిది

image

థైరాయిడ్ హార్మోను సవ్యంగా విడుదలైనప్పుడే జీవక్రియల పనితీరు బాగుంటుంది. లేదంటే పలు సమస్యలొస్తాయంటున్నారు నిపుణులు. దీనికోసం మందులతో పాటు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు. అయోడిన్ ఉన్న ఉప్పు, చిక్కుళ్లు, బటానీలు, ఇన్‌ఫ్లమేషన్ తగ్గించే విటమిన్ C ఉండే ఫ్రూట్స్, ఫిష్, ఓట్స్, మిల్లెట్స్ ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. ✍️ మహిళలు, చైల్డ్ కేర్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>> కేటగిరీలోకి వెళ్లండి.