News October 23, 2025
HYD: బుల్లెట్ తీసిన డాక్టర్లు.. అబ్జర్వేషన్‌లో సోను

పోచారం కాల్పుల ఘటనలో గాయపడ్డ సోనుకు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో ఆపరేషన్ ముగిసింది. 6 గంటల పాటు శ్రమించిన వైద్యులు శరీరం నుంచి బుల్లెట్‌ను బయటకు తీశారు. 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఇది పూర్తయిన తర్వాత సోనుకు మరో సర్జరీ అవసరం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. <<18075641>>సోను<<>> మీద జరిగిన దాడిని బీజేపీ నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుడిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News October 23, 2025
PM ఆవాస్ యోజన పథకాన్ని వినియోగించుకోవాలి: కలెక్టర్

PM ఆవాస్ యోజన గ్రామీణ్ పథకాన్ని అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. గురువారం పెద అమిరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఆమె సమీక్షించారు. జిల్లాలోని 319 రెవెన్యూ గ్రామాల్లో ఈనెల 22 నుంచి సచివాలయ సిబ్బందితో సర్వే ప్రారంభించాలన్నారు. అర్హులుగా ఉండి, సొంత స్థలం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.
News October 23, 2025
కృష్ణా: భారీ వర్షాలు.. విద్యుత్ అధికారుల హెచ్చరిక

భారీ వర్షాలు, గాలుల నేపథ్యంలో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండటంతో జిల్లా విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తడిచిన విద్యుత్ స్తంభాలను, లైన్‌కు తగిలిన చెట్లను ముట్టుకోవద్దని చెప్పారు. విద్యుత్ లైన్ దెబ్బతిన్నట్లు గమనిస్తే వెంటనే సిబ్బంది, లేదా 1912 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.
News October 23, 2025
మేడ్చల్-మల్కాజిగిరిలో 5 వేలకు చేరువలో వైన్స్ టెండర్లు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 88 మద్యం దుకాణాలకు మొత్తం 4,910 దరఖాస్తులు అందినట్లు DPEO నవీన్ తెలిపారు. దరఖాస్తుల గడువును ఎక్సైజ్ శాఖ 18 నుంచి 23వ తేదీ వరకు పొడిగించిన తర్వాత కేవలం 30 దరఖాస్తులు మాత్రమే అందినట్లు తెలిపారు. ఈరోజు చివరి రోజు కావడంతో మరికొన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. సా.5 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగనున్నట్లు తెలిపారు. ఈనెల 27వ తేదీన డ్రా నిర్వహించనున్నారు.