News October 23, 2025
వరంగల్: మార్కెట్ సమస్యలు పట్టడం లేదా..?

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్, లక్ష్మిపురం కూరగాయ, పండ్ల మార్కెట్లు, ముసలమ్మకుంట మామిడి మార్కెట్ హాల్‌లో కనీస సౌకర్యాలు లేక రైతులు ఆగ్రహంలో ఉన్నారు. మంత్రి కొండా సురేఖ, మార్కెటింగ్ శాఖ కమిషనర్ హామీలు ఇప్పటివరకు అమలు కావట్లేదు. సీసీ కెమెరాలు కూడా లేకపోవడంతో సురక్షితత సమస్య ఉంది. జిల్లా రైతులు మంత్రి, ఎమ్మెల్యేలను సమస్య పరిష్కరించేందుకు మాముల మార్కెట్‌ను పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News October 23, 2025
GNT: స్కూల్స్‌కు సెలవుపై పేరెంట్స్ విమర్శలు

భారీ వర్షాల కారణంగా గురువారం పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులు తీసుకున్న నిర్ణయంపై తల్లిదండ్రులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఉదయం 9 గంటల తర్వాత సెలవు ప్రకటించడంపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అప్పటికే పిల్లలు వర్షంలో తడుస్తూ పాఠశాలలకు వెళ్లిపోయారని, ఉదయం నుంచే వర్షం పడుతున్నందున ముందుగానే స్పందించి ఉండాల్సిందన్నారు. రేపటి సెలవు సమాచారమైనా ముందుగానే స్పష్టంగా ఇవ్వాలన్నారు.
News October 23, 2025
SRCL: జీతాలు మాయం చేసిన సెక్రటరీ అరెస్ట్

మల్టీపర్పస్ వర్కర్ల జీతాలను మాయం చేసిన మాజీ పంచాయతీ సెక్రెటరీ సయ్యద్ ముక్తార్ అహ్మద్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇల్లంతకుంట SI అశోక్ తెలిపారు. ప్రస్తుతం వీర్నపల్లి మండలానికి బదిలీ అయిన ముక్తార్ ఐదుగురు మల్టీపర్పస్ కార్మికుల రూ.1,42,000లను చెక్కుల ద్వారా తన వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నాడని వివరించారు. ఓగులాపూర్ గ్రామపంచాయతీలో 2025 జనవరి నుంచి మే నెల వరకు అతడు విధులు నిర్వర్తించాడు.
News October 23, 2025
బ్రహ్మచర్యంలో పాటించాల్సిన 8 నియమాలు

బ్రహ్మచర్యాన్ని పూర్వీకులు 8 విధాలుగా వివరించారు. అవి..
1. మహిళల రూపంపై దృష్టి సారించకుండా ఉండడం, 2. వారిని తాకకపోవడం, 3. స్త్రీలు నాట్యమాడుతుండగా చూడకపోవడం, 4. శారీరక సుఖాలకు సంబంధించిన సంభాషణలకు దూరంగా ఉండటం, 5. స్త్రీలతో ఒంటరిగా ఉండే అవకాశాలను నివారించడం, 6. మనస్సులో శృంగారపరమైన ఆలోచనలు రాకుండా ఉండటం, 7. వివాహ ప్రయత్నాలను ఆపడం, 8. శారీరక సుఖాన్ని కోరుకోకుండా ఉండడం. <<-se>>#Sankhya<<>>