News October 23, 2025

కృష్ణా: వర్షంతో రోడ్లు అస్తవ్యస్తం

image

అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పట్టణం, పరిసర గ్రామాల్లో రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. రోడ్లు నీట మునగడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితులు దారుణంగా మారి, వర్షపునీరు, మురుగు కలసి కాలువల నుండి బయటకు పొంగి దుర్వాసన వ్యాపిస్తోంది. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Similar News

News October 23, 2025

కృష్ణా: భారీ వర్షాలు.. రైతు కంట నీరు

image

రైతులకు ఈ సార్వా పంట మొదలు పెట్టినప్పటి నుంచీ కష్టాలే ఎదురవుతున్నాయి. వరి నారుమడి సమయంలో వర్షాలకు నారు పాడై, నారు దొరకని పరిస్థితి. ఆ తర్వాత యూరియా కొరత, ఎరువులు అందక సుదూర ప్రాంతాల నుంచి అధిక మొత్తంలో డబ్బు చెల్లించి మరీ వాడారు. పంటకు పెట్టాల్సిన పెట్టుబడి అంతా అయిపోయిందనుకున్న సమయంలో, ఈ తుఫాను వల్ల పొలాలన్నీ నేలమట్టం అయ్యాయి. దీంతో కళ్లముందే పంట నష్టం జరగడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

News October 23, 2025

కృష్ణా: భారీ వర్షాలు.. విద్యుత్ అధికారుల హెచ్చరిక

image

భారీ వర్షాలు, గాలుల నేపథ్యంలో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండటంతో జిల్లా విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తడిచిన విద్యుత్ స్తంభాలను, లైన్‌కు తగిలిన చెట్లను ముట్టుకోవద్దని చెప్పారు. విద్యుత్ లైన్ దెబ్బతిన్నట్లు గమనిస్తే వెంటనే సిబ్బంది, లేదా 1912 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.

News October 23, 2025

కృష్ణా జిల్లాను ముంచెత్తిన వాన

image

కృష్ణా జిల్లాను వర్షం ముంచెత్తింది. మచిలీపట్నం, అవనిగడ్డ, పెడన, బంటుమిల్లి, ఉయ్యూరు తదిరత ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. అత్యధికంగా మచిలీపట్నంలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా నాగాయలంకలో 7.6, బంటుమిల్లిలో 5.6, ఘంటసాలలో 5.4 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో 1-5 సెంటీ మీటర్ల మధ్య వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా వరితో పాటు ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయి.