News October 23, 2025
ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వీ యాదవ్?

బిహార్ మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని ఆర్జేడీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఆ కూటమిలో సీట్ల పంపకాల వివాదం సద్దుమణిగినట్లు తెలుస్తోంది.
Similar News
News October 23, 2025
సన్నధాన్యం: ఈ ప్రమాణాలు ఉంటేనే రూ.500 బోనస్

TG: సన్నధాన్యానికి ప్రభుత్వం క్వింటాకు ₹500 బోనస్ ఇస్తోంది. అయితే బియ్యపు గింజ పొడవు, వెడల్పుల నిష్పత్తి నిర్దేశిత ప్రమాణాల మేర ఉంటేనే బోనస్ వస్తుంది. గ్రెయిన్ కాలిపర్ అనే మిషన్ ద్వారా గింజ పొడవు, వెడల్పు కొలుస్తారు. గింజ పొడవు 6mm, వెడల్పు 2mm కంటే తక్కువ ఉండాలి. పొడవు, వెడల్పుల నిష్పత్తి 2.5mm కంటే ఎక్కువ ఉండేవాటికి ప్రాధాన్యం ఇస్తారు. * రోజూ అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News October 23, 2025
258 ఉద్యోగాలకు షార్ట్ నోటిఫికేషన్

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 258 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్(ACIO) పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ వెలువడింది. B.E./B.Tech/M.Tech పూర్తి చేసిన వారు అర్హులు. వారి గేట్ స్కోర్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వయసు 18-27 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. ఈ వారంలో పూర్తిస్థాయి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. వెబ్‌సైట్: https://www.mha.gov.in/
News October 23, 2025
బ్రహ్మచర్యంలో పాటించాల్సిన 8 నియమాలు

బ్రహ్మచర్యాన్ని పూర్వీకులు 8 విధాలుగా వివరించారు. అవి..
1. మహిళల రూపంపై దృష్టి సారించకుండా ఉండడం, 2. వారిని తాకకపోవడం, 3. స్త్రీలు నాట్యమాడుతుండగా చూడకపోవడం, 4. శారీరక సుఖాలకు సంబంధించిన సంభాషణలకు దూరంగా ఉండటం, 5. స్త్రీలతో ఒంటరిగా ఉండే అవకాశాలను నివారించడం, 6. మనస్సులో శృంగారపరమైన ఆలోచనలు రాకుండా ఉండటం, 7. వివాహ ప్రయత్నాలను ఆపడం, 8. శారీరక సుఖాన్ని కోరుకోకుండా ఉండడం. <<-se>>#Sankhya<<>>