News October 23, 2025
భారత్ బ్యాటింగ్.. టీమ్స్ ఇవే

టీమ్ ఇండియాతో రెండో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
భారత్: రోహిత్ శర్మ, గిల్ (C), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా: హెడ్, మార్ష్(C), షార్ట్, రెన్‌షా, కారే, కొన్నోలీ, ఓవెన్, బార్ట్‌లెట్, స్టార్క్, జంపా, హేజిల్‌వుడ్.
Similar News
News October 23, 2025
మానవాళికి దైవానుగ్రహం ఎందుకు అవసరం?

మనం వేసిన విష బీజం విష ఫలాన్నే ఇస్తుంది. అలాగే మన చెడు కర్మల ఫలితంగా మనకు బాధలు, దుఃఖాలు కలుగుతాయి. ఈ కర్మ బంధాన్ని తెంచుకోవడం మానవ ప్రయత్నంతో సాధ్యం కాదు. ఎందుకంటే, మన కర్మలన్నీ అసంఖ్యాకమైనవి. అందుకే, ఈ బంధాల నుంచి విముక్తి పొందడానికి దైవానుగ్రహం అవసరం. ఆ దేవుడి కృప మనకు లభించినప్పుడు, ఆయన శక్తి మన కర్మ ఫలాలను తొలగించి, కష్టాల నుంచి విముక్తిని, నిజమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది. <<-se>>#Daivam<<>>
News October 23, 2025
భారత్ ఓటమి

AUSతో జరిగిన రెండో వన్డేలో భారత్ పరాజయం పాలైంది. ఈ ఓటమితో ఇంకో మ్యాచ్ ఉండగానే 0-2 తేడాతో వన్డే సిరీస్‌ను కోల్పోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన IND 50 ఓవర్లలో 264-9 రన్స్ చేసింది. 265 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఆసీస్ 2 వికెట్ల తేడాతో గెలిచింది. షార్ట్(74), కాన్లీ(61), ఒవెన్(36) రాణించారు. IND బౌలర్లలో హర్షిత్ రాణా, సుందర్, అర్ష్‌దీప్ తలో 2 వికెట్లు తీశారు. 25న సిడ్నీలో మూడో వన్డే జరగనుంది.
News October 23, 2025
రావి చెట్టును ఎందుకు పూజించాలి?

రావి వృక్షం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. యజ్ఞాలలో జమ్మితో పాటు రావి కర్రలను కూడా ఉపయోగిస్తారు. దీని ఔషధ గుణాలు అనారోగ్యాలను దూరం చేస్తాయి. గర్భదోషాలు తొలగించే గుణం ఉన్నందున సంతానం లేనివారు ఈ చెట్టుకు ప్రదక్షిణ చేస్తే సంతానం కలుగుతుందని నమ్మకం. బుద్ధునికి జ్ఞానోదయమైంది ఈ వృక్షం కిందే. అందుకే ఆలయాల్లో రావి వృక్షాలకు కూడా పూజలు చేస్తారు. ☞ ఇలాంటి ఆధ్యాత్మిక కంటెంట్ కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీ వెళ్లండి.