News October 23, 2025
HYD: తెలుగు వర్సిటీ VCగా నిత్యానందరావు ఏడాది పూర్తి

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీ వీసీ ఆచార్య వెల్దండ నిత్యానందరావు తన పదవి కాలంలో ఏడాది పూర్తి అయింది. దీంతో వర్సిటీ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం బాచుపల్లి ఆడిటోరియంలో సన్మానించారు. రిజిస్ట్రార్ ఆచార్య హనుమంతరావు మాట్లాడుతూ.. ఆధునిక కళామందిరం,క్రీడా ప్రాంగణం, విద్యార్థులకు, ఉద్యోగులకు సదుపాయాలను కల్పిస్తూ వర్సిటీలో వివిధ అభివృద్ధి పనులను చేపట్టడం హర్షదాయకమన్నారు. వర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News October 23, 2025
పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులతో సీపీ భేటీ

పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. గురువారం కమిషనరేట్లో పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులతో సీపీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు వారి సమస్యలను వివరించారు. ప్రధానంగా ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్ధలం సంబంధించి సమస్యలపై విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన సీపీ.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
News October 23, 2025
నెల్లూరు: ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పల్లిపాడులోని జిల్లా విద్యా శిక్షణ సంస్థలో ఖాళీల భర్తీకి DEO డా.ఆర్ బాలాజీ రావు నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్లాలో 5 సం.లు అనుభవం కలిగిన స్కూల్ అసిస్టెంట్లు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సీనియర్, జూనియర్ లెక్చర్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్, తెలుగు, ఫిజిక్స్, ఫైన్ ఆర్ట్స్, ఇంగ్లిష్, సీనియర్, జూనియర్ లెక్చరర్ ఇన్ ఈవీఎస్, సోషల్ పోస్టులకు గాను గూగుల్ ఫామ్ ద్వారా ఈనెల 29వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
News October 23, 2025
మానవాళికి దైవానుగ్రహం ఎందుకు అవసరం?

మనం వేసిన విష బీజం విష ఫలాన్నే ఇస్తుంది. అలాగే మన చెడు కర్మల ఫలితంగా మనకు బాధలు, దుఃఖాలు కలుగుతాయి. ఈ కర్మ బంధాన్ని తెంచుకోవడం మానవ ప్రయత్నంతో సాధ్యం కాదు. ఎందుకంటే, మన కర్మలన్నీ అసంఖ్యాకమైనవి. అందుకే, ఈ బంధాల నుంచి విముక్తి పొందడానికి దైవానుగ్రహం అవసరం. ఆ దేవుడి కృప మనకు లభించినప్పుడు, ఆయన శక్తి మన కర్మ ఫలాలను తొలగించి, కష్టాల నుంచి విముక్తిని, నిజమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది. <<-se>>#Daivam<<>>