News October 23, 2025
పెద్దపల్లి: 16 నెలల చిన్నారి మృతి

ముత్తారంలో విషాదం నెలకొంది. లక్కారం గ్రామానికి చెందిన శ్రీనివాస్-తారకల కుమార్తె అభిజ్ఞ(16 నెలల) చికిత్స పొందుతూ మృతి చెందింది. చిన్నారికి జ్వరం రావడంతో కుటుంబీకులు పెద్దపల్లిలోని ఓ ప్రైవేట్‌లో చికిత్స అందించారు. అస్వస్తతకు గురవడంతో అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి మృతి చెందింది. ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ పాప చనిపోయిందని కుటుంబీకులు ఆరోపించారు.
Similar News
News October 23, 2025
సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలి: కవిత

తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష నియామకాల్లో టీజీపీఎస్సీ… రాష్ట్రపతి ఉత్తర్వులను తుంగలో తొక్కి ఆర్టికల్ 371-డి ని ఉల్లంఘించిందంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని సుమోటోగా తీసుకోని విచారించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్‌కు ఆమె లేఖ రాశారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి తెలంగాణ అభ్యర్థులకు అన్యాయం చేసిందన్నారు.
News October 23, 2025
వరిలో కంపు నల్లి – నివారణకు సూచనలు

ఖరీఫ్ వరి పంటలో గింజ పాలు పోసుకొనే దశలో కంపు నల్లి ఆశించడం వల్ల గింజపై నల్లని మచ్చలు ఏర్పడి, గింజలు తాలుపోతాయి. నవంబరు వరకు దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. బూడిద, ఆకుపచ్చ రంగులోని నల్లి పురుగులు పంటను ఆశిస్తాయి. వీటి వల్ల పొలంలో చెడు వాసన వస్తుంది. ఈ నల్లిని సాయంత్రం వేళ పొలంలో గమనించవచ్చు. వీటి నివారణకు లీటరు నీటికి క్లోరిపైరిఫాస్ 2.5ml లేదా మలాథియాన్ 2ml కలిపి సాయంత్రం వేళ పిచికారీ చేయాలి.
News October 23, 2025
ANU: నానో టెక్నాలజీ పరీక్షా ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జులై నెలలో జరిగిన I, V ఇయర్స్ నానో టెక్నాలజీ సెకండ్ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను గురువారం వర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. ఫలితాల రీవాల్యుయేషన్ కోసం నవంబర్ 3వ తేదీలోపు ఒక్కో సబ్జెక్టుకు రూ.1860లు చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు వర్సిటీలోని సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు.