News October 23, 2025

మెదక్: మంత్రి వివేక్‌ Vs హరీశ్‌రావు

image

సిద్దిపేట కలెక్టరేట్‌లో బుధవారం చెక్కుల పంపిణీలో మంత్రి వివేక్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మధ్య మాటల యుద్దం జరిగింది. కళ్యాణ లక్ష్మితోపాటు తులం బంగారం, ఔట్ సోర్సింగ్ సిబ్బంది జీతాలు, సిద్దిపేటలో ఆగిపోయిన అభివృద్ధి పనులపై హరీశ్ ప్రశ్నించగా, BRS చేసిన అప్పులు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం అందజేతపై మంత్రి మాట్లాడారు. విమర్శలు, ప్రతివిమర్శలు, సమాధానాలతో ఇరువురి ప్రసంగాలు సాగాయి.

Similar News

News October 23, 2025

పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులతో సీపీ భేటీ

image

పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. గురువారం కమిషనరేట్లో పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులతో సీపీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు వారి సమస్యలను వివరించారు. ప్రధానంగా ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్ధలం సంబంధించి సమస్యలపై విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన సీపీ.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.

News October 23, 2025

నెల్లూరు: ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

image

పల్లిపాడులోని జిల్లా విద్యా శిక్షణ సంస్థలో ఖాళీల భర్తీకి DEO డా.ఆర్ బాలాజీ రావు నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్లాలో 5 సం.లు అనుభవం కలిగిన స్కూల్ అసిస్టెంట్లు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సీనియర్, జూనియర్ లెక్చర్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్, తెలుగు, ఫిజిక్స్, ఫైన్ ఆర్ట్స్, ఇంగ్లిష్, సీనియర్, జూనియర్ లెక్చరర్ ఇన్ ఈవీఎస్, సోషల్ పోస్టులకు గాను గూగుల్ ఫామ్ ద్వారా ఈనెల 29వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

News October 23, 2025

మానవాళికి దైవానుగ్రహం ఎందుకు అవసరం?

image

మనం వేసిన విష బీజం విష ఫలాన్నే ఇస్తుంది. అలాగే మన చెడు కర్మల ఫలితంగా మనకు బాధలు, దుఃఖాలు కలుగుతాయి. ఈ కర్మ బంధాన్ని తెంచుకోవడం మానవ ప్రయత్నంతో సాధ్యం కాదు. ఎందుకంటే, మన కర్మలన్నీ అసంఖ్యాకమైనవి. అందుకే, ఈ బంధాల నుంచి విముక్తి పొందడానికి దైవానుగ్రహం అవసరం. ఆ దేవుడి కృప మనకు లభించినప్పుడు, ఆయన శక్తి మన కర్మ ఫలాలను తొలగించి, కష్టాల నుంచి విముక్తిని, నిజమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది. <<-se>>#Daivam<<>>