News October 23, 2025
సిర్సనగండ్లలో అత్యధిక వర్షపాతం నమోదు

జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా వంగూరు మండలం సిర్సనగండ్లలో 12.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొల్లాపూర్ 7.3, పెద్ద పెద్దపల్లి 6.8, కల్వకుర్తి 4.5, యెంగంపల్లి, బోలంపల్లి 3.5, ఊర్కొండ 2.5, జటప్రోలు 1.0, తోటపల్లి, తెలకపల్లి 0.8, అత్యల్పంగా నాగర్‌కర్నూల్, ఐనోల్‌లో 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.
Similar News
News October 23, 2025
సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలి: కవిత

తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష నియామకాల్లో టీజీపీఎస్సీ… రాష్ట్రపతి ఉత్తర్వులను తుంగలో తొక్కి ఆర్టికల్ 371-డి ని ఉల్లంఘించిందంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని సుమోటోగా తీసుకోని విచారించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్‌కు ఆమె లేఖ రాశారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి తెలంగాణ అభ్యర్థులకు అన్యాయం చేసిందన్నారు.
News October 23, 2025
వరిలో కంపు నల్లి – నివారణకు సూచనలు

ఖరీఫ్ వరి పంటలో గింజ పాలు పోసుకొనే దశలో కంపు నల్లి ఆశించడం వల్ల గింజపై నల్లని మచ్చలు ఏర్పడి, గింజలు తాలుపోతాయి. నవంబరు వరకు దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. బూడిద, ఆకుపచ్చ రంగులోని నల్లి పురుగులు పంటను ఆశిస్తాయి. వీటి వల్ల పొలంలో చెడు వాసన వస్తుంది. ఈ నల్లిని సాయంత్రం వేళ పొలంలో గమనించవచ్చు. వీటి నివారణకు లీటరు నీటికి క్లోరిపైరిఫాస్ 2.5ml లేదా మలాథియాన్ 2ml కలిపి సాయంత్రం వేళ పిచికారీ చేయాలి.
News October 23, 2025
ANU: నానో టెక్నాలజీ పరీక్షా ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జులై నెలలో జరిగిన I, V ఇయర్స్ నానో టెక్నాలజీ సెకండ్ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను గురువారం వర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. ఫలితాల రీవాల్యుయేషన్ కోసం నవంబర్ 3వ తేదీలోపు ఒక్కో సబ్జెక్టుకు రూ.1860లు చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు వర్సిటీలోని సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు.