News October 23, 2025
ద్వారకాతిరుమల: రూ. 97 కోట్ల చెక్కు అందజేత

ద్వారకాతిరుమలలో సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ ర్యాలీ కార్యక్రమం బుధవారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు పాల్గొని మండల సమైక్య సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అనంతరం డ్వాక్రా సంఘాలకు శ్రీనిధి పథకం ద్వారా 16,654 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.97,62,95,000 చెక్కును అందజేశారు.
Similar News
News October 23, 2025
HYD: ప్రజాపాలన వైపే ప్రజలు: మంత్రి సీతక్క

జూబ్లీహిల్స్ ప్రజలు ప్రజాపాలన వైపే ఉన్నారని మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు జూబ్లీహిల్స్ పరిధి బోరబండ డివిజన్ స్వరాజ్ నగర్‌లో ఆమె ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. నవీన్ యాదవ్ గెలుపు ఖాయమైందని స్పష్టం చేశారు. BRS నేతలు ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీ తప్పక గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి నవీన్ యాదవ్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు ఉన్నారు.
News October 23, 2025
గుంటూరులో ట్రాఫిక్ నిర్వహణపై ఎస్పీ ఆకస్మిక పర్యటన

గుంటూరు నగరంలో ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ పనితీరును ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించారు. పట్టాభిపురం, బ్రాడీపేట, కొత్తపేట, బస్టాండ్ సెంటర్, తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణకు అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News October 23, 2025
మిస్సింగ్ ఉద్యోగులు.. రంగంలోకి ఇంటెలిజెన్స్

TG: కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్యలో అవకతవకలపై ఇంటెలిజెన్స్ దర్యాప్తు మొదలైందని విశ్వసనీయ సమాచారం. ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఎంతమంది, ఎంతకాలంగా పని చేస్తున్నారనే వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల ఉద్యోగుల వివరాలు సేకరించగా.. 1.03 లక్షల మంది సమాచారం లేదు. కానీ, వీరి పేరిట పదేళ్లుగా నెలకు రూ.150కోట్ల జీతాలు జమ అవుతున్నాయి. దీంతో ప్రభుత్వం అంతర్గత విచారణకు ఆదేశించింది.