News October 23, 2025
పోచారం కాల్పులు.. రౌడీషీటర్ ఇబ్రహీం అరెస్ట్

పోచారం కాల్పుల ఘటనలో నిందితులు అరెస్ట్ అయ్యారు. CP సుధీర్ బాబు ఆదేశాలతో ప్రత్యేక బృందాలు ప్రధాన నిందితుడు ఇబ్రహీం, మోసిన్, శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నాయి. మరో నిందితుడు హనీఫ్ ఖురేషి పరారీలో ఉన్నాడు. తరచూ తమ వ్యాపారానికి అడ్డొస్తున్నాడని కక్ష పెంచుకున్న ఇబ్రహీం, అతడి స్నేహితులు సోను మర్డర్‌కు ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే నిన్న <<18078700>>యంనంపేట్<<>>లోని కిట్టి స్టీల్ వద్ద అతడిపై కాల్పులు జరిపారు.
Similar News
News October 23, 2025
BREAKING: HYD: విషాదం.. ఇంటర్ విద్యార్థి మృతి

ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఘట్‌కేసర్ పరిధి యమ్నంపేట్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీ బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి ఇంటర్ విద్యార్థి అభిచేతన్ రెడ్డి(17) పడ్డాడు. అతడిని మేడిపల్లిలోని శ్రీకర హాస్పిటల్‌కి తరలించగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు తెలిపారు. డెడ్‌బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా అతడు దూకాడా?, ఎవరైనా తోశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
News October 23, 2025
జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెసోళ్లను నిలదీయండి: KCR

పేద గర్భిణులకు మానవీయ కోణంలో అందిస్తోన్న KCR కిట్ పథకాన్ని ఎందుకు ఆపేశారో కాంగ్రెసోళ్లను జూబ్లీహిల్స్ ప్రజలు నిలదీయాలని మాజీ CM KCR పిలుపునిచ్చారు. యాదవులకు అందిస్తోన్న గొర్రెల పంపిణీ పథకాన్ని ఎందుకు రద్దు చేశారో, చేపల పంపిణీ ఎందుకు దిగమింగారో ఓటు అడిగేందుకు ఇంటి ముందుకు వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థిని అడగాలని KCR కోరారు. పథకాలపై ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.
News October 23, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. KCR పిలుపు

జూబ్లీహిల్స్ బైపోల్‌పై మాజీ CM KCR మొదటి సారి మాట్లాడారు. కాంగ్రెస్ దుష్ట పాలనపై ప్రజలకు BRS నేతలు, కార్యకర్తలు వివరించి, అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ రౌడీ షీటర్‌ను నిలబెట్టి HYD ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టిందన్నారు. రౌడీషీటర్‌ను ఓడించి, HYDలో శాంతిభద్రతలను కాపాడాలని కోరారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ దోపిడీ పాలనతో తెలంగాణను గుల్లా చేసిందన్నారు.