News April 9, 2024
అద్దంకిలో ఆ రికార్డ్ బద్దలయ్యేనా..

2009లో కాంగ్రెస్ నుంచి గొట్టిపాటి రవి కుమార్ 15,764 ఓట్లు మెజార్టీతో విజయం సాధించగా.. 1999లో టీడీపీ నుంచి బి.గరటయ్య కేవలం 249 ఓట్లతో గెలిచారు. అద్దంకిలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగగా.. గొట్టిపాటికి వచ్చిన 15,764 ఓట్ల మెజార్టీనే అత్యధిక రికార్డు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి హనిమిరెడ్డి, కూటమి నుంచి మరోసారి గొట్టిపాటి బరిలో ఉన్నారు. ఈయన రికార్డును హనిమిరెడ్డి బ్రేక్ చేయగలరనుకుంటున్నారా.
Similar News
News October 5, 2025
అవార్డులకు వేళాయే.. కీలక ప్రకటన చేసిన ప్రకాశం కలెక్టర్!

జిల్లాస్థాయిలో స్వచ్ఛఆంధ్ర-స్వర్ణఆంధ్రకు సంబంధించి 49 అవార్డులు జిల్లాకు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఇదే విషయాన్ని కలెక్టర్ రాజాబాబు స్వయంగా ప్రకటించారు. అయితే జిల్లా స్థాయిలో స్వచ్ఛఆంధ్ర-స్వర్ణఆంధ్ర అవార్డులకు ఎంపికైన పంచాయతీలు, బస్టాండ్, ఇతర విభాగాలకు 6 తేదీన అవార్డులను ఆయా పంచాయతీలలో అందజేయనున్నారు. ఈ మేరకు ప్రకాశం కలెక్టర్ కార్యాలయం శనివారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది.
News October 4, 2025
ప్రకాశం జిల్లాలో ఉపాధి శ్రమికులకు బిగ్ అలర్ట్

ప్రకాశం జిల్లాలోని ఉపాధి హామీ కూలీలకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ శనివారం కీలక సూచన చేసింది. ఉపాధి హామీ పథకం ద్వారా పని కోరే ప్రతి శ్రామికుడు ఈ-కేవైసి చేయించుకోవాలని తెలిపింది. నవంబర్ 7లోగా ఉపాధి శ్రమికులు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకొని, పని పొందటంలో ఎలాంటి ఇబ్బంది పడవద్దని సంబంధిత అధికారులు సూచించారు. అన్ని గ్రామాల్లో నిర్వహించే ఈ కేవైసీ ప్రక్రియ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.
News October 4, 2025
నేడు ప్రకాశం జిల్లాకు మోస్తరు వర్షసూచన.!

ప్రకాశం జిల్లాలో శనివారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించగా, ప్రకాశంకు మాత్రం మోస్తారు వర్ష సూచన ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే వర్షాలు కురిసే సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.