News October 23, 2025
జూరాలకు 15,241 క్యూసెక్కుల వరద

గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గింది. గురువారం ఉదయం ఇన్ ఫ్లో 15,241 క్యూసెక్కులు వస్తుంది. ప్రాజెక్టు అన్ని గేట్లు మూసివేశారు. పవర్ హౌస్‌కు 17,176 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే కుడి కాలువకు 700 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 1,030 క్యూసెక్కులు, సమాంతర కాలువకు 46, బీమా లిఫ్ట్ -2 కు 783, మొత్తం 18,999 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
Similar News
News October 23, 2025
జనగామ: రేపు సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభం

జనగామ మండలం ఓబుల్ కేశ్వాపూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర కాటన్ ఇండస్ట్రీలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా పత్తి కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. పత్తి కనీస మద్దతు ధర క్వింటాకు రూ.8,110 నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుకింగ్ ఈనెల 24వ తేదీ వరకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
News October 23, 2025
విశాఖ గ్రోత్ హబ్ పనులు మరింత వేగవంతం: CS

AP: విశాఖ గ్రోత్ హబ్, పూర్వోదయ పథకాలపై నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం సచివాలయంలో CS విజయానంద్‌తో భేటీ అయ్యారు. ఏపీలో ఓడరేవులున్నా ఒక కంటైనర్ మెగా పోర్టు అవసరముందని ఆయన సూచించారు. పూర్వోదయ స్కీమ్‌తో తీరప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. VSP గ్రోత్ హబ్ పనుల వేగవంతానికి ప్రత్యేకంగా ఇన్‌ఛార్జిని నియమించనున్నామని CS చెప్పారు. కేంద్రం నుంచి తగినన్ని నిధులు వచ్చేలా చూడాలని సీఈఓను కోరారు.
News October 23, 2025
సూర్యాపేటలో వ్యభిచారం

సూర్యాపేట జనగాం క్రాస్ రోడ్డు సమీపంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ కిరాయి ఇంటిపై రూరల్ పోలీసులు దాడి చేశారు. నిర్వాహకురాలితో పాటు ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై బాలు నాయక్ తెలిపారు. పక్కా సమాచారం మేరకు బుధవారం మధ్యాహ్నం దాడులు నిర్వహించిన పోలీసులు, ఇద్దరిపై కేసు నమోదు చేసి గురువారం రిమాండ్‌కు పంపారు.