News October 23, 2025
రాజేంద్రనగర్‌లోని NIRDPRలో ఉద్యోగాలు

రాజేంద్రనగర్‌లోని NIRDPRలో పని అనుభవం ఉన్నవారికి ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారు. UG, PG, PHD చేసి, అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. రూ.50 వేల జీతంతో రీసెర్చ్ అసోసియేట్ 8 పోస్టులు, సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ ఒక పోస్టుకు రూ.లక్ష వేతనం ఇవ్వనున్నారు. ఈ 9 ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిక్ కింద భర్తీ చేస్తారు. R.Aకు 50 ఏళ్లు, SPCకి 65 ఏళ్లు మించొద్దు. OCT 29న వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది.
SHARE IT
Similar News
News October 23, 2025
జనగామ: రేపు సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభం

జనగామ మండలం ఓబుల్ కేశ్వాపూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర కాటన్ ఇండస్ట్రీలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా పత్తి కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. పత్తి కనీస మద్దతు ధర క్వింటాకు రూ.8,110 నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుకింగ్ ఈనెల 24వ తేదీ వరకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
News October 23, 2025
విశాఖ గ్రోత్ హబ్ పనులు మరింత వేగవంతం: CS

AP: విశాఖ గ్రోత్ హబ్, పూర్వోదయ పథకాలపై నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం సచివాలయంలో CS విజయానంద్‌తో భేటీ అయ్యారు. ఏపీలో ఓడరేవులున్నా ఒక కంటైనర్ మెగా పోర్టు అవసరముందని ఆయన సూచించారు. పూర్వోదయ స్కీమ్‌తో తీరప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. VSP గ్రోత్ హబ్ పనుల వేగవంతానికి ప్రత్యేకంగా ఇన్‌ఛార్జిని నియమించనున్నామని CS చెప్పారు. కేంద్రం నుంచి తగినన్ని నిధులు వచ్చేలా చూడాలని సీఈఓను కోరారు.
News October 23, 2025
సూర్యాపేటలో వ్యభిచారం

సూర్యాపేట జనగాం క్రాస్ రోడ్డు సమీపంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ కిరాయి ఇంటిపై రూరల్ పోలీసులు దాడి చేశారు. నిర్వాహకురాలితో పాటు ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై బాలు నాయక్ తెలిపారు. పక్కా సమాచారం మేరకు బుధవారం మధ్యాహ్నం దాడులు నిర్వహించిన పోలీసులు, ఇద్దరిపై కేసు నమోదు చేసి గురువారం రిమాండ్‌కు పంపారు.