News October 23, 2025
అభ్యంగన స్నానం వెనుక ఆంతర్యమిదే!

శరీరాద్యంతము తైలమును అంటుకోవడమే అభ్యంగనం. అనగా ఆముదము గానీ, నువ్వుల నూనె గానీ, నెయ్యి, వెన్న మొదలైన ఏదో ఒక తైలమును శరీరమంతా బాగా పట్టించి కనీసం 30 నిమిషాల తర్వాత శీకాయపొడి కానీ, పెసరపిండి కానీ, శనగపిండి గానీ ఉపయోగించి గోరువెచ్చటి నీటితో స్నానము చేయాలి. ఇది ఆధ్యాత్మిక నియమమే కాదు. ఆరోగ్యకరం కూడా! అందుకే పండుగల్లో దీన్ని విధిగా ఆచరించాలని మన పెద్దలు సూచిస్తుంటారు. కార్తీక మాసంలో ఈ నియమం ముఖ్యం.
Similar News
News October 23, 2025
ఇరిగేషన్ మరమ్మతుల ప్రతిపాదనలు సిద్ధం చేయండి: కలెక్టర్

జిల్లాలో రూ.258 కోట్లతో 350 మైనర్ ఇరిగేషన్ చెరువుల మరమ్మతుల పునరుద్ధరణ, పునర్నిర్మాణం పనుల ప్రతిపాదనను వెంటనే ప్రభుత్వానికి అందించాలని కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు.
గురువారం ఆమె కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 200 చిన్న తరహా సాగు, తాగునీటి చెరువుల ఫిల్లింగ్‌కు సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే అందించాలన్నారు.
News October 23, 2025
ఉద్యోగ ఒత్తిడి ప్రాణాంతకం: ప్రొఫెసర్

దీర్ఘకాలిక ఉద్యోగ ఒత్తిడి, టాక్సిక్ ఆఫీస్ కల్చర్ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించి, అకాల మరణానికి కూడా దారితీయవచ్చని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. జెఫ్రీ పిఫెర్ హెచ్చరించారు. అధిక పని గంటలు, ఉద్యోగ భద్రత లేమి వంటి అంశాలు ఒత్తిడి సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణాలని ఆయన తెలిపారు. హానికరమైన ఉద్యోగంలో కొనసాగడం వ్యక్తి శ్రేయస్సుకు ప్రమాదమని ఈ అంశాన్ని ముఖ్యమైన ప్రజారోగ్య సమస్యగా అభివర్ణించారు.
News October 23, 2025
పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

TG: టెన్త్ ఫైనల్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపు తేదీలను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ప్రకటించింది. OCT 30-NOV 13లోపు HMలకు ఫీజు చెల్లించాలని తెలిపింది. వాళ్లు ఆన్‌లైన్‌లో NOV 14లోపు ఫీజు చెల్లించాలని, విద్యార్థుల డేటాను నవంబర్ 18లోపు DEOలకు అందించాలని పేర్కొంది. రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్ 29 వరకు, రూ.200తో DEC 2-11 వరకు, రూ.500 లేట్ ఫీజ్‌తో DEC 15-29 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించింది.