News October 23, 2025

వరంగల్: క్వింటా తేజా మిర్చి ధర రూ.14,300

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు బుధవారం రూ.16,000 ధర పలకగా.. నేడు రూ.15,849 ధర పలికింది. వండర్ హాట్(WH) మిర్చి నిన్న రూ.16,500 ధర వస్తే.. నేడు రూ.16,800 అయింది. తేజా మిర్చి బుధవారం రూ.14,400 ధర పలకగా.. గురువారం రూ.14,300 ధర వచ్చింది.

Similar News

News October 23, 2025

బంగ్లాదేశ్‌కు ఏపీ ప్రభుత్వం లేఖ

image

AP: విజయనగరం(D)కి చెందిన 8మంది మత్స్యకారులు పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి ప్రవేశించి అక్కడి నావికాదళానికి పట్టుబడడం తెలిసిందే. దీంతో వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారి విడుదలపై ఏపీ ప్రభుత్వం బంగ్లాదేశ్ GOVTకి లేఖ రాసింది. వారిని క్షేమంగా వెనక్కు రప్పిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆందోళన వద్దని ఆ కుటుంబాలకు సూచించారు.

News October 23, 2025

JGTL: పెళ్లి పత్రికలు ఇచ్చొస్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి

image

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరి సమీపంలోని రైతు వేదిక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పెగడపల్లి SI కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల మండలం సోమన్పల్లికి చెందిన చెట్ల వంశీ, ఉప్పెర రంజిత్ ద్విచక్రవాహనంపై మండలంలోని ఐతుపల్లిలో పెండ్లి పత్రికలు ఇచ్చి తిరిగి వస్తుండగా, వారిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు.

News October 23, 2025

GNT: దూరవిద్య పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో జులై, ఆగస్ట్ మాసాలలో జరిగిన పలు యూజీ, పీజీ కోర్సుల పరీక్ష ఫలితాలను వర్సిటీ రెక్టార్ ఆర్. శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ జి. సింహాచలంలు గురువారం విడుదల చేశారు. ఎంఏ ఎకనామిక్స్, బిఎల్ఐసి, బిఏ, బీకాం, బిబిఎం పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. కార్యక్రమంలో కేంద్రం డైరెక్టర్ వంకాయలపాటి వెంకటేశ్వర్లు, కోఆర్డినేటర్ డి.రామచంద్రన్, తదితరులు పాల్గొన్నారు.