News October 23, 2025
KMM: పాఠాలు చెప్పే సార్లూ.. మీకు కూడా చెప్పాలా?

విద్యార్థులకు పాఠాలు బోధించి, వారి అభ్యున్నతి కాంక్షించాల్సిన కొందరు టీచర్లు ఈ మధ్య గాడి తప్పి వరుస సస్పెన్షన్లకు గురవుతున్నారు. ఖమ్మంలో ఓ ఉపాధ్యాయుడు ఓ షాపు యజమానిపై దాడి. కూసుమంచి(M), కొణిజర్ల(M)లో టీచర్లు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. తిరుమలాయపాలెం(M)లో ఓ టీచర్ ధర్నాలో పాల్గొన్నారు. విద్యా బుద్ధులు నేర్పే టీచర్లే ఇలా ప్రవర్తిస్తుండటంతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Similar News
News October 23, 2025
పాడేరు: ‘జనగణన ప్రక్రియకు ప్రారంభంకానున్న శిక్షణ’

2027లో నిర్వహించనున్న జనాభా జనగణన ప్రక్రియకు సంబంధించి గురువారం అధికారులకు కలెక్టరేట్‌లో శిక్షణ నిర్వహించారు. గణనకు సంబంధించి ముందుగా జీకేవీధి మండలంలోని 6 పంచాయతీల పరిధిలో ఉన్న 18 గ్రామాల్లో ప్రీ టెస్ట్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని డీఆర్వో కే.పద్మలత తెలిపారు. గణన ప్రక్రియ మొత్తం డిజిటల్ పద్ధతిలో రెండు దశల్లో జరుగుతుందన్నారు. మొబైల్ అప్లికేషన్ ద్వారా సమాచారం సేకరించబడుతుందన్నారు.
News October 23, 2025
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ గైడ్‌లైన్స్ విడుదల

AP: NCTE నిబంధనల ప్రకారం TET నిర్వహించేలా GOVT గైడ్‌లైన్స్ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో టీచర్లందరికీ టెట్ తప్పనిసరి చేసింది. టెట్ 2A, 2B (B.Ed) పేపర్లలో SC, ST, BC, PHCలకు అర్హత మార్కుల్లో మినహాయింపు ఈసారి లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇన్ సర్వీస్ టీచర్లు కూడా టెట్ పాసవ్వాలి. అయితే వారికి నిర్దేశిత అర్హతల నుంచి మినహాయింపు ఇచ్చారు. డిటైల్డ్ గైడ్ లైన్స్ కోసం <
News October 23, 2025
పూడూరు: ఆర్టీసీ బస్సు ఢీ.. వ్యక్తి మృతి

పూడూరు మండలం సోమన్గుర్తి శివారులో గురువారం రాత్రి స్టీల్ ఫ్యాక్టరీ ముందు నేషనల్ హైవే రోడ్డుపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాదాచారుడిని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని రాజస్థాన్‌కు చెందిన రితేష్ (22)గా గుర్తించారు. అతను ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.