News October 23, 2025

ATM కార్డు కాజేసి డబ్బులు డ్రా.. బాధితుల ఆవేదన

image

సత్తెనపల్లిలో ATM సెంటర్ వద్ద వద్ద గుర్తు తెలియని వ్యక్తి సాయం తీసుకున్న ఓ వృద్ధురాలి కార్డును దుండగుడు మార్చేశాడు. అక్టోబర్ 6 నుంచి 13వ తేదీ వరకు ఏకంగా 23 సార్లు నగదు డ్రా చేసి, మొత్తం రూ.2.87 లక్షలు కాజేశాడు. సెల్‌ఫోన్‌కు మెసేజ్ రావడంతో మోసపోయినట్లు గుర్తించిన దంపతులు పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఎస్సై పవన్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News October 23, 2025

పాడేరు: ‘జనగణన ప్రక్రియకు ప్రారంభంకానున్న శిక్షణ’

image

2027లో నిర్వహించనున్న జనాభా జనగణన ప్రక్రియకు సంబంధించి గురువారం అధికారులకు కలెక్టరేట్‌లో శిక్షణ నిర్వహించారు. గణనకు సంబంధించి ముందుగా జీకేవీధి మండలంలోని 6 పంచాయతీల పరిధిలో ఉన్న 18 గ్రామాల్లో ప్రీ టెస్ట్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని డీఆర్వో కే.పద్మలత తెలిపారు. గణన ప్రక్రియ మొత్తం డిజిటల్ పద్ధతిలో రెండు దశల్లో జరుగుతుందన్నారు. మొబైల్ అప్లికేషన్ ద్వారా సమాచారం సేకరించబడుతుందన్నారు.

News October 23, 2025

టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ గైడ్‌లైన్స్ విడుదల

image

AP: NCTE నిబంధనల ప్రకారం TET నిర్వహించేలా GOVT గైడ్‌లైన్స్ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో టీచర్లందరికీ టెట్ తప్పనిసరి చేసింది. టెట్‌ 2A, 2B (B.Ed) పేపర్లలో SC, ST, BC, PHCలకు అర్హత మార్కుల్లో మినహాయింపు ఈసారి లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇన్ సర్వీస్ టీచర్లు కూడా టెట్‌ పాసవ్వాలి. అయితే వారికి నిర్దేశిత అర్హతల నుంచి మినహాయింపు ఇచ్చారు. డిటైల్డ్ గైడ్ లైన్స్ కోసం <>క్లిక్<<>> చేయండి.

News October 23, 2025

పూడూరు: ఆర్టీసీ బస్సు ఢీ.. వ్యక్తి మృతి

image

పూడూరు మండలం సోమన్గుర్తి శివారులో గురువారం రాత్రి స్టీల్ ఫ్యాక్టరీ ముందు నేషనల్ హైవే రోడ్డుపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాదాచారుడిని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని రాజస్థాన్‌కు చెందిన రితేష్ (22)గా గుర్తించారు. అతను ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.