News October 23, 2025
మైలవరంలో రేపు జాబ్ మేళా రద్దు

మైలవరం పట్టణ పరిధిలోని లక్కిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రేపు (అక్టోబర్ 24) జరగవలసిన మెగా జాబ్ మేళాను ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రద్దు చేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కార్యాలయం వారు తెలిపారు. తిరిగి ఈ మెగా జాబ్ మేళాను ఈ నెల 31వ తేదీన నిర్వహిస్తున్నట్లు వారు ప్రకటించారు. కావున నిరుద్యోగులు అందరూ గమనించవలసిందిగా కోరారు.
Similar News
News October 23, 2025
కమ్యూనిటీ హాల్ నిర్వహణ బల్దియాదే: బల్దియా కమిషనర్

నగరంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హాల్ నిర్వహణ బల్దియాదేనని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేసిన అన్ని కమ్యూనిటీ హాల్‌లను వెంటనే స్వాధీనం చేసుకోవాలన్నారు. ఇకపై బల్దియా అధికారులే నిర్వహణ చేయాలని కమిషనర్ సూచించారు.
News October 23, 2025
రూ.79వేల కోట్ల ప్రతిపాదనలకు రక్షణశాఖ ఆమోదం

రూ.79వేల కోట్లతో ఆయుధాలు, పరికరాలు కొనుగోలు చేసేందుకు త్రివిధ దళాలకు ఆమోదం లభించింది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో నిర్వహించిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ భేటీలో ఈ ప్రతిపాదనలను ఆమోదించారు. ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థ, అడ్వాన్స్‌డ్ లైట్ వెయిట్ టార్పిడోలు, నాగ్ క్షిపణి వ్యవస్థ, ల్యాండింగ్ ప్లాట్‌ఫాం డాక్స్, 30MM నేవల్ సర్ఫేస్ గన్స్, హై మొబిలిటీ వెహికల్స్, ట్రాక్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.
News October 23, 2025
ఆ టీడీపీ ఎమ్మెల్యేపై వేటు తప్పదా?

AP: తిరువూరు TDP MLA కొలికపూడి శ్రీనివాస్‌పై అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ఏదో ఒక వివాదంలో నిలుస్తున్నారు. గతంలో TDP నేత రమేశ్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ రచ్చకెక్కారు. తర్వాత MP కేశినేని చిన్నితో గొడవలు మొదలయ్యాయి. ఇవాళ ఆ <<18082832>>వివాదం<<>> తారస్థాయికి చేరడంతో CBN సీరియస్ అయ్యారు. ఇక మాటల్లేవని స్పష్టం చేశారు. దీంతో కొలికపూడిపై వేటు వేస్తారా? అనే చర్చ మొదలైంది.