News April 9, 2024

కామారెడ్డి: బస్సు ఢీకొని MBA విద్యార్థి మృతి

image

సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలం ఇస్నాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కామారెడ్డికి చెందిన ఆకుల అరుణ్ (23) మృతి చెందాడు. అరుణ్ గీతం యూనివర్సిటీలో ఎంబీఏ చదుతున్నాడు. కాగా నిన్న సాయంత్రం స్నేహితుడి వద్ద ఉన్న ల్యాప్‌టాప్ తీసుకుని వెళ్తుండగా ఓ పరిశ్రమకు చెందిన బస్సు అతని బైకును ఢీకొట్టింది. దీంతో అరుణ్ అక్కడిక్కడే మృతి చెందాడు. పఠాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News September 10, 2025

NZB జిల్లా నుంచి ఇద్దరు నేతలు BJP రాష్ట్ర కార్యవర్గంలోకి

image

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జిల్లా నుంచి ఇద్దరు నాయకులను బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ బీజేపీ ఫ్లోర్ లీడర్ జీ.స్రవంతి రెడ్డిని రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీనర్సయ్యను బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ప్రకటించారు.

News September 10, 2025

NZB: సబ్ జూనియర్ బాస్కెట్‌బాల్ సెలక్షన్స్ నేడు

image

నిజామాబాద్ జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో స్థానిక డీఎస్ఏ మైదానంలో ఇవాళ ఉదయం 11:30కు సబ్ జూనియర్స్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు బాస్కెట్‌బాల్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు విజయ్ కుమార్, బొబ్బిలి నరేష్ తెలిపారు. ఈ సెలక్షన్స్‌లో పాల్గొనే క్రీడాకారులు 2012 జనవరి 1 తర్వాత జన్మించి ఉండాలన్నారు. ఇతర వివరాల కోసం ఆర్గనైజింగ్ కార్యదర్శి నిఖిల్‌ను సంప్రదించవచ్చని సూచించారు.

News September 9, 2025

గిరిజనులకు సౌర గిరి జల వికాసం పథకం: కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

image

గిరిజనులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని ప్రారంభించిందని, అర్హులైన పోడు పట్టాదారులను గుర్తించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఈ పథకం అమలుపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ పథకం అమలు కోసం చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో 15 మండలాల్లో పోడు భూములకు పట్టాలు అందించినట్లు తెలిపారు.