News October 23, 2025
పెట్రోల్ బంకులో కానిస్టేబుల్ వీరంగంపై కేసు నమోదు!

పెట్రోల్ బంకులో కానిస్టేబుల్ వీరంగం చేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు చీరాల గ్రామీణ సీఐ శేషగిరిరావు తెలిపారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో భారత పెట్రోల్ బంక్‌లో జరిగిన సంఘటనపై బంక్‌లో పనిచేసే మిక్కిలి అజయ్ కుమార్ వేటపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అజయ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్‌పై వేటపాలెం పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Similar News
News October 24, 2025
ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల

రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 10 నుంచి రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నట్లు TET కన్వీనర్ కృష్ణా రెడ్డి తెలిపారు. 9.30am నుంచి 12pm వరకు తొలి సెషన్, 2.30-5pm రెండో సెషన్ నిర్వహిస్తామన్నారు. రేపటి నుంచి నవంబర్ 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. DEC 3న హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వచ్చే ఏడాది JAN 19న ఫలితాలు వెలువడతాయని పేర్కొన్నారు.
News October 24, 2025
ఓస్లో సదస్సుకు హాజరు కానున్న ఏలూరు ఎంపీ

నార్వే ప్రభుత్వం నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమాలకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హాజరుకానున్నారు. లింగ సమానత్వం, మహిళా సాధికారతపై ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం ఆధ్వర్యంలో నార్వే ప్రభుత్వ సహకారంతో ఓస్లోలో నవంబర్ 2 నుంచి 8 వరకు సదస్సు నిర్వహిస్తున్నారు. భారతదేశం తరఫున హాజరయ్యే ఎంపీల బృందంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఉన్నారు. గత నెల 24న ఆహ్వానం అందినట్లు ఎంపీ గురువారం తెలిపారు.
News October 24, 2025
AP న్యూస్ రౌండప్

*రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుంటే జగన్ ఎందుకు అడ్డుకుంటున్నారు: మంత్రి అనగాని సత్యప్రసాద్
*గోశాలలో గోవులు అధికంగా మరణిస్తున్నాయన్న నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: భూమన కరుణాకర్ రెడ్డి
*శ్రీశైలం దేవస్థానానికి 35 రోజుల్లో రూ.4,08,69,958 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడి
*విశాఖలో దొంగనోట్లు తయారు చేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన శ్రీరామ్ అలియాస్ గుప్తా అరెస్ట్. ప్రింటర్, ల్యాప్‌ట్యాప్ స్వాధీనం.