News October 23, 2025
బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్‌గా అమిత అగర్వాల్ బాధ్యతల స్వీకరణ

బీబీనగర్ ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ అమిత అగర్వాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఎయిమ్స్ కార్యకలాపాలు, అవసరాలపై ప్రత్యక్ష దృష్టి సారిస్తానని తెలిపారు. విద్యాపరమైన పురోగతికి ఒక రోడ్‌మ్యాప్‌ను రూపొందించేందుకు ప్రతి విభాగాన్ని వ్యక్తిగతంగా సందర్శిస్తానని ఆమె పేర్కొన్నారు.
Similar News
News October 24, 2025
ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియాలో మేనేజర్ పోస్టులు… అప్లై చేశారా?

ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా( EPI) లిమిటెడ్‌లో 18 మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఈ నెల 29 ఆఖరు తేదీ. బీటెక్, బీఈ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి వయోపరిమితిలో సడలింపు ఉంది. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.50వేలు, HRA చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://epi.gov.in/
News October 24, 2025
వింజమూరు: కర్నూల్ బస్సు ప్రమాదంలో ఒక కుటుంబం సేఫ్

కర్నూల్ BUS ప్రమాదంలో వింజమూరు(M) కొత్తపేటకు చెందిన నెలకుర్తి రమేశ్ కుటుంబం సురక్షితంగా బయటపడింది. ప్రమాదాన్ని గమనించి BUS అద్దాలను పగులగొట్టి భార్య శ్రీలక్ష్మి(26), కుమారుడు అకీరా (2), కుమార్తె జయశ్రీ (5)లను రమేశ్ కాపాడుకున్నారు. వింజమూరు(M)గోళ్లవారిపల్లికి చెందిన <<18088100>>గోళ రమేశ్ కుటుంబం మృతి చెందిన విషయం తెలిసిందే.<<>> ఈ2 కుటుంబాలు హైదరాబాదులో దీపావళి వేడుకులను చేసుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
News October 24, 2025
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భావుబీజ్ వేడుకలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కాతమ్ముడు, అన్నాచెల్లెల్ల అనుబంధాన్ని చాటుతూ భావుబీజ్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దీపావళి తర్వాత ఈ పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్ జిల్లాల్లో ఈ సంస్కృతి ఉంది. యమధర్మరాజు తన చెల్లెలు యమున ఇంట్లో భోజనం చేసిన రోజుగా దీనిని భావిస్తారు. అన్నాతమ్ములు ఎక్కడ ఉన్నా, వారి వద్దకు వెళ్లి హారతులు ఇస్తామని స్త్రీలు చెబుతున్నారు.


