News October 23, 2025
కృష్ణా: రెవెన్యూ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష

మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారులతో కలెక్టర్ బాలాజీ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో తహశీల్దార్లు, మండల పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. తహశీల్దార్లు, వీఆర్వోలు సర్వేయర్లతో కలిసి జిల్లాలో ఉన్న లేఔట్లను క్షేత్రస్థాయిలో సందర్శించి, ఖాళీ స్థలాలను గుర్తించాలన్నారు.
Similar News
News October 24, 2025
డిజిటల్ ట్రేసబులిటీతో రైతులకు లాభాలు: కలెక్టర్

నూతన వ్యవసాయ విధానం వలన పెట్టుబడి వ్యయం, విద్యుత్ ఛార్జీల వ్యయం గణనీయంగా తగ్గుతుందని
కలెక్టర్ బాలాజీ అన్నారు. సకాలంలో పంట కోతను చాలా జాగ్రత్తగా పర్యవేక్షించవచ్చని పేర్కొన్నారు. అలాగే, డిజిటల్ ట్రేసబులిటీ ద్వారా రైతులు తమ పంట వివరాలను సులభంగా నమోదు చేసుకోవచ్చని, దీనివల్ల బ్యాంకులు రుణాలు మంజూరు చేయడమే కాక భీమా కంపెనీలు కూడా భీమా సదుపాయాలు అందిస్తున్నాయని కలెక్టర్ వివరించారు.
News October 23, 2025
ధాన్యం సేకరణకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్

గత సంవత్సరం ఖరీఫ్ సీజన్‌లో కొన్నిచోట్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఈసారి అలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ బాలాజీ ఆదేశించారు. ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద తగిన గోదాములు, తూకం యంత్రాలు, తడి ధాన్యం ఆరబెట్టే వసతులు, రైతులకు తాగునీరు, విశ్రాంతి సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
News October 23, 2025
ఉయ్యూరు: అత్యాచార నిందితుడిని రోడ్డుపై నడిపించిన పోలీసులు

ఉయ్యూరులో రెండు రోజుల క్రితం బాలికపై జరిగిన అత్యాచారం కేసులో నిందితుడు చాంద్ బాషాను పోలీసులు గురువారం నడిరోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు తీసుకెళ్లారు. నిందితుడిని కోర్టులో హాజరు పరిచే నిమిత్తం ఉయ్యూరు పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు పోలీసులు సంకెళ్లతో నడిపించుకుంటూ తీసుకెళ్లారు. నిందితుడిని రోడ్డుపై తీసుకెళ్తుంటే జనాలు బారులు తీరి, చిన్నారికి న్యాయం జరిగేలా చూడాలని ప్రార్థించారు.