News October 23, 2025
ఇతిహాసాలు క్విజ్ – 44 సమాధానాలు

1. భరతుని మేనమామ ‘యధాజిత్తు’.
2. ఉత్తరుడు మత్స్య దేశపు రాజు అయిన విరాటరాజు, సుధేష్ణల కుమారుడు.
3. బ్రహ్మ నివసించే లోకం పేరు ‘సత్య లోకం’.
4. గరుడ పక్షి విష్ణువు వాహనం.
5. భారతదేశంలోని ఏకైక బ్రహ్మ ఆలయం రాజస్థాన్‌లోని పుష్కర్‌లో ఉంది.
<<-se>>#Ithihasaluquiz<<>>
Similar News
News February 18, 2026
AI కనెక్టివిటీకి భారత్‌కు గూగుల్ సబ్‌సీ కేబుల్స్

AI రంగంలో భారత్ అసాధారణ వృద్ధిని సాధిస్తుందని గూగుల్ CEO సుందర్ పిచాయ్ ‘AI ఇంపాక్ట్ సమ్మిట్’లో పేర్కొన్నారు. భారత్-US మధ్య AI కనెక్టివిటీని పెంచేందుకు సబ్‌సీ కేబుల్ ప్రాజెక్టును ప్రకటించారు. $15 బిలియన్ల AI హబ్ ద్వారా భారత్‌లో భారీగా మౌలిక సదుపాయాలు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. భారత విద్యార్థుల కోసం హిందీ, ఇంగ్లీష్‌లో ప్రత్యేక సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించినట్లు గుర్తుచేశారు.
News February 18, 2026
తన అనారోగ్య సమస్యను వివరించిన మమ్ముట్టి

గతేడాది తాను జ్ఞానేంద్రియాల సమస్య ఎదుర్కొన్నట్లు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వెల్లడించారు. ‘విన్పించడం, వాసన గుర్తించడం లాంటివి చాలాకాలం తెలియలేదు. నడిచేందుకూ ఇబ్బంది పడ్డా. చికిత్సతో పూర్తిగా కోలుకుంటున్నా’ అని తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. మనిషికి జ్ఞానేంద్రియాలు గొప్ప వరమని, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. కాగా 2025లో షూటింగ్‌ల నుంచి బ్రేక్ తీసుకోవడంతో క్యాన్సర్ అని రూమర్స్ వచ్చాయి.
News February 18, 2026
అభిని పక్కనబెట్టి సంజూను తీసుకోవాలని డిమాండ్లు

అభిషేక్ శర్మ గత 7 అంతర్జాతీయ టీ20ల్లో 5 సార్లు (ఈ WCలో 3 సార్లు) డకౌట్ కావడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి మెగా టోర్నీల్లో ఇంత నిర్లక్ష్యంగా ఆడటం ఏంటని టీమ్ ఇండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కీలకమైన సూపర్-8లో అభిని పక్కనబెట్టి సంజూ శాంసన్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?


