News April 9, 2024
వాలంటీర్లు రాజీనామా చేయవద్దు: కోటంరెడ్డి

వైసీపీ నాయకుల బెదిరింపులకు భయపడి వాలంటీర్లు రాజీనామాలు చేయవద్దని.. నెల్లూరు రూరల్ టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేసే వారిని చంద్రబాబు కొనసాగిస్తారని చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కందమూరులో జరిగిన ఎన్నికల ప్రచారంలో కోటంరెడ్డి మాట్లాడారు.
Similar News
News October 5, 2025
వ్యవసాయ విజేతలను ఎంపిక చెయ్యండి : కలెక్టర్

జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఛాంపియన్ ఫార్మర్ ఎంపిక చేసి, వ్యవసాయంలో నూతన విధానాల అమలు ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. యాంత్రీకరణపై జరిగిన వర్క్ షాప్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ ఆధారిత జిల్లాలో వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేసేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమన్నారు.
News October 4, 2025
శ్రీవారి గర్భాలయంలోకి వెళ్ళగానే కోర్కెలు మరిచిపోతాం.. ఎందుకు?

తిరుమల శ్రీవారి గర్భాలయంలోకి వెళ్ళగానే జగన్మోహనకారాన్ని చూస్తూ బాహ్యప్రపంచాన్ని మర్చిపోతారు భక్తులు. ప్రధానాచార్యుల తపోబలం, యోగబలం, సంప్రోక్షణ ముహూర్త బలం వల్ల సకలదేవతలు స్వామిచుట్టూ కొలువై ఉండటమే ఇందుకు కారణమని పండితులు చెబుతున్నారు. దేవతల దివ్యశక్తి నిత్యం ఆలయంలో ప్రవహిస్తూ ఉంటడంతో విమాన ప్రాకారంలోకి ప్రవేశించిన భక్తుల మనసు ఏకాగ్రతం అవుతుంది. బంగారు వాకిలి దాటగానే బాహ్యప్రపంచంలోకి అడుగు పెడతారట.
News October 4, 2025
నెల్లూరు జిల్లాకు వ్యవసాయ పరికరాలు ఇస్తారా?

ఇప్పటికే అక్టోబర్ వచ్చేయడంతో రైతులు సాగుకు అవసరమైన పరికరాలను సిద్ధం చేసుకొనే పనుల్లో ఉన్నారు. 2024-25 ఏడాదిలో రూ. 286.90 లక్షలు మంజూరు చేయగా.. 151 రొటీవెటర్లు, 569 కల్టివేటర్లు, 482 స్ప్రేయర్లు, 73 గుంటకలు, 53 హాఫ్ కేజీ వీల్స్, 62 బ్రష్ కట్టర్లు తోపాటు మొత్తం 1447 పరికరాలను 50% సబ్సిడీతో సరఫరా చేశారు. మరీ ఈ సీజన్‌కు ఏమాత్రం కేటాయింపులు ఇస్తారో చూడాలి.