News October 23, 2025

భీమడోలులో మహిళా దొంగ అరెస్ట్

image

బస్టాండుల్లో ప్రయాణికుల బ్యాగులను దొంగిలిస్తున్న మహిళను గురువారం భీమడోలు సర్కిల్ పోలీసులు అరెస్ట్ చేశామన్నారు. పోలీసుల వివరాల మేరకు.. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడికి చెందిన వేములపల్లి దుర్గ ప్రయాణికులను టార్గెట్ చేసి వారి బ్యాగులను దొంగిలిస్తుంది. నేడు నమోదైన ఓ కేసులో ఆమె నుంచి 33.5 గ్రాముల బంగారం, 117 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News October 24, 2025

ప్రభాస్ ‘స్పిరిట్‌’లో ఆ నటుడు లేనట్లేనా?

image

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో <<18087082>>స్పిరిట్<<>> మూవీ రానున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన సౌండ్ స్టోరీలో ప్రధాన పాత్రల్లో నటించే వారి వివరాలను వెల్లడించారు. ఈ సినిమాలో కొరియన్ యాక్టర్ డాన్ లీ నటిస్తారని గతంలో ప్రచారం జరిగినా దీనిపై మూవీ యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తాజా అప్డేట్‌లోనూ ఆయన పేరు లేకపోవడంతో, ఎలాగైనా లీని ప్రాజెక్టులోకి తీసుకురావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

News October 24, 2025

కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్

image

భారీ వర్షాల నేపధ్యంలో అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ ఉండరాదన్నారు. ఇబ్బందులు ఎదురైతే సహాయం కోసం 8500292992కు కాల్ చేయాలన్నారు.

News October 24, 2025

ADB: జిల్లాస్థాయి యువజనోత్సవాలకు దరఖాస్తులు

image

ఆదిలాబాద్‌ జిల్లా స్థాయి యువజనోత్సవాలను నవంబర్ 4న నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. 15 నుంచి 29 సంవత్సరాల యువత ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు అర్హులని పేర్కొన్నారు. పాటలు, వక్తృత్వం, శాస్త్రీయ నృత్యం, క్విజ్, ఫోక్ సాంగ్స్ వంటి ఏడు అంశాలలో పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి ఉన్నవారు నవంబర్ 3 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని, పోటీలు డీఆర్‌డీఏ మీటింగ్ హాలులో జరుగుతాయని వివరించారు.