News October 23, 2025
నిర్మాణ పనులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం తన ఛాంబర్‌లో హౌసింగ్, మెప్మా, మున్సిపల్ అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై సమీక్షించారు. గడువులోగా హౌస్ సైట్ మార్కౌట్ పనులు వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులకు అవగాహన కల్పించి, ఇళ్లు త్వరితగతిన నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News October 24, 2025
ప్రభాస్ ‘స్పిరిట్’లో ఆ నటుడు లేనట్లేనా?

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో <<18087082>>స్పిరిట్<<>> మూవీ రానున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన సౌండ్ స్టోరీలో ప్రధాన పాత్రల్లో నటించే వారి వివరాలను వెల్లడించారు. ఈ సినిమాలో కొరియన్ యాక్టర్ డాన్ లీ నటిస్తారని గతంలో ప్రచారం జరిగినా దీనిపై మూవీ యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తాజా అప్డేట్‌లోనూ ఆయన పేరు లేకపోవడంతో, ఎలాగైనా లీని ప్రాజెక్టులోకి తీసుకురావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
News October 24, 2025
కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్

భారీ వర్షాల నేపధ్యంలో అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ ఉండరాదన్నారు. ఇబ్బందులు ఎదురైతే సహాయం కోసం 8500292992కు కాల్ చేయాలన్నారు.
News October 24, 2025
ADB: జిల్లాస్థాయి యువజనోత్సవాలకు దరఖాస్తులు

ఆదిలాబాద్ జిల్లా స్థాయి యువజనోత్సవాలను నవంబర్ 4న నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. 15 నుంచి 29 సంవత్సరాల యువత ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు అర్హులని పేర్కొన్నారు. పాటలు, వక్తృత్వం, శాస్త్రీయ నృత్యం, క్విజ్, ఫోక్ సాంగ్స్ వంటి ఏడు అంశాలలో పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి ఉన్నవారు నవంబర్ 3 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని, పోటీలు డీఆర్‌డీఏ మీటింగ్ హాలులో జరుగుతాయని వివరించారు.