News October 23, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. KCR పిలుపు

జూబ్లీహిల్స్ బైపోల్‌పై మాజీ CM KCR మొదటి సారి మాట్లాడారు. కాంగ్రెస్ దుష్ట పాలనపై ప్రజలకు BRS నేతలు, కార్యకర్తలు వివరించి, అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ రౌడీ షీటర్‌ను నిలబెట్టి HYD ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టిందన్నారు. రౌడీషీటర్‌ను ఓడించి, HYDలో శాంతిభద్రతలను కాపాడాలని కోరారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ దోపిడీ పాలనతో తెలంగాణను గుల్లా చేసిందన్నారు.
Similar News
News October 24, 2025
PKL: టాప్-4లో తెలుగు టైటాన్స్

ప్రోకబడ్డీ లీగ్ 12వ సీజన్‌లో ప్లేఆఫ్(టాప్-8) జట్లు ఖరారయ్యాయి. టాప్-4లో పుణేరి పల్టాన్, దబాంగ్ ఢిల్లీ, బెంగళూరు బుల్స్, తెలుగు టైటాన్స్ ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో హరియాణా స్టీలర్స్, యూ ముంబా, పాట్నా పైరెట్స్, జైపూర్ పింక్ పాంథర్స్ ఉన్నాయి. రేపు జరిగే ప్లే ఆఫ్ మ్యాచుల్లో హరియాణా-జైపూర్, యూ ముంబా-పింక్ పాంథర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నెల 26న బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్ పోటీ పడనుంది.
News October 24, 2025
కృష్ణుడు దొంగిలించేది వెన్నను కాదు.. దోషాలను!

వెన్న దొంగతనం అనేది కృష్ణుడి లీల మాత్రమే కాదు. దీని వెనుక వేరే పరమార్థం ఉంది. వెన్న దాచిపెట్టే అత్తాకోడళ్ల ఇళ్లలో స్వార్థం, అహంకారం, అతిథి సత్కారం చేయకపోవడం వంటి దోషాలుండేవి. వాటిని భగ్నం చేయడానికి కోడలిపై నింద పడేలా చేసి, వారి మధ్య తగవులు పెట్టాడు. తద్వారా వారి మనస్సులు లౌకిక చింతల నుంచి తనపై కేంద్రీకృతమయ్యేలా చేశాడు. ఇలా వారిని భక్తి మార్గానికి మళ్లించి, మోక్షాన్ని ప్రసాదించాడు. <<-se>>#KRISHNALEELA<<>>
News October 24, 2025
MBNR: కురుమూర్తి జాతర స్పెషల్ బస్సుల వివరాలిలా.!

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉమ్మడి MBNR జిల్లాలోని పలు డిపోల నుంచి ఈనెల 27, 28, 29న జాతరకు వెళ్లే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నారు. బస్సుల వివరాలు.. కొల్లాపూర్ డిపో నుంచి-32, MBNR-80, వనపర్తి -65, NGKL-65, NRPT-28 మొత్తం 270 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఈ బస్సులు MBNR, WNP, NGKL, కొత్తకోట, పెబ్బేరు, దేవరకద్ర, ఆత్మకూర్ మొదలగు ప్రదేశాల నుంచి నడుపుతామని అధికారులు తెలిపారు.


